death toll in illicit liquor tragedy climbs to 90

Mumbai hooch tragedy toll climbs to 90

Mumbai hooch tragedy, Malwani police station, spurious liquour, Mumbai Police Commissioner, Rakesh Maria, Mumbai suburban

The death toll in the illicit liquor tragedy in a suburban Mumbai bar shot up to 90 on Saturday with twenty eight more people succumbing to the poisonous brew, officials said here.

ముంబైలో 90 మంది ప్రాణాలను బలితీసుకున్న కల్తీ సారా

Posted: 06/20/2015 08:04 PM IST
Mumbai hooch tragedy toll climbs to 90

ముంబైలో కల్తీ సారా తాగి మృత్యువాత పడిన మృతుల సంఖ్య 90కు చేరింది. ఈ విషాధ ఘటనలో శనివారం మరో 28 మంది మృత్యువాత పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ముంబైలోని మాల్వాని ప్రాంతం లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న బస్తీవాసులు గురువారం రాత్రి స్థానికంగా విక్రయిస్తున్న కల్తీసారాను సేవించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే.. 30 మంది మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.

ఈ ఘటనలో కల్తీ సారా విక్రయించిన ఐదుగురు నిందితులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 304, 328, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా ధర్మాసనం వారికి జూన్ 26 వరకు కస్టడీ విధించింది. మరోవైపు ఈ వ్యవహారంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారంటూ మాల్వాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్సిపెక్టర్ సహా మరో ఏడుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని, దీనిపై రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులను ఆదేశించారు.

కాగా, ముంబైలో ఇంతటి దారుణ ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోసారి. కల్తీసారా బారిన పడి ఇంత పెద్ద సంఖ్యలో స్థానికులు మృత్యువాత పడుతుండటం కూడా ఇదే మొదటిసారి. గత పదకొండేళ్లల్లో ఇంతటి దారుణ ఘటన ఎప్పుడూ చోటుచేసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. గతంలో 11 ఏళ్ల క్రితం కల్తీసారా తాగిన ఘటనలో 87 మంది మృతి చెందారు. ప్రస్తుత ఘటనలో మృతుల సంఖ్య 91కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే బాధితులందరికీ మెరుగైన చికిత్స కల్పించాలని, మహారాష్ట్ర ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  hooch tragedy  death toll  90 dead  

Other Articles