Look Where You Pee. 109 People Jailed In Agra For Urinating In Public.

109 in agra pee their way to jail

urinating Agra, Agra Cantt Station, Civil sense, clean india initiatives, Agra division, cleanliness drive, Gopeshnath Khanna, GRP, india, Initiatives, narendra modi, news, People caught for peeing in public, policemen, Railway police, Senior superintended of police, Swachh Bharat, Taj Mahal, Tourism, up, urinating in public, Uttar Pradesh

Agra police conducted a cleanliness drive across 12 stations of Government Railway Police (GRP), Agra division. During this unprecedented cleanliness drive, GRP sent 109 people to jail for 24 hours, after they were found urinating in public areas.

మూత్రవిసర్జన చేశారు.. ఊచలు లెక్కబెట్టారు..

Posted: 06/27/2015 02:08 PM IST
109 in agra pee their way to jail

మగవాళ్లు మూత్రం ఎక్కడపోస్తారురా..? అన్ని అడిగిన ప్రశ్నకు.. విదేశాలలో అయితే టాయ్ లెట్లలో.. ఇండియాలో అయితే ఎక్కడ పడితే అక్కడే అన్న సినిమా జోకు గుర్తుందా..? అది ఇకపై ఒకనాటి మాటగా మారనుంది. ఇకపై భారత్ లో కూడా ఎక్కడ పడితే అక్కడ మూత్ర విజర్జన చేస్తే.. ఏకంగా జైలులో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది. బహిరంగ మూత్ర విసర్జనను నిషేధించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే స్వచ్ఛా భారత్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. నమ్మకంగా లేదా..?

అయితే ఈ స్టోరీ చదవండీ. రైల్వే ఆస్తులు ఉన్న ప్రాంతాల్లో మూత్రవిసర్జన చేసిన 109 మందిని ఆగ్రా డివిజన్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ప్లాట్‌ఫామ్‌లు, రైల్వే ట్రాక్‌లు, గొడౌన‌్లు.. ఇలా రైల్వే ఆస్తులు వున్న చోట మూత్ర విసర్జన చేశారు. వీరందరినీ అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు.. మూత్ర విసర్జన చేసిన వారికి 24 గంటలపాటు జైలుశిక్షతో పాటు రూ.500 జరిమానా కూడా విధించారు. మూత్రవిసర్జనే కాదండోయ్.. పాన్, పాన్ మసాలా, గుట్కా, రజనీగంధా తంబాకు ఇత్యాదులు నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మిన వారికి కూడా ఇదే శిక్ష వేశారు.

ప్రధాని రూపకల్పన చేసిన ‘స్వచ్ఛభారత్’ స్ఫూర్తతోనే తాము ఈ చర్యలకు పాల్పడ్డామని రైల్వే పోలీసు సీనియర్ సూపరింటెండ్ అధికారి గోపేష్ నాథ్ ఖన్నా తెలిపారు., ప్రధాని స్పూర్తితో తాము కేవలం ఆగ్రా రైల్వే డివిజన్ పరిధిలోని 12 స్టేషన్లలో బహిరంగ మూత్ర విసర్జనకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడంతోనే ఇంత మంది దోరికారని, ఇలా దేశవ్యాప్తంగా చర్యలు తీసుకుంటే మార్పు రావడం కష్టసాధ్యమేమీ కాదని చెప్పారు. మన దేశానికి లక్షాలాధిగా వస్తున్న విదేశీ పర్యాటకులకు మంచి వాతావరణం కల్పిస్తే.. క్రమేనా వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంటుందని చెప్పారు. ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి శిక్షలు అమలు చేస్తామని రేల్వై అధికారి తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jailed  publicly urinating  railway stations  agra division  

Other Articles