Kejriwal | Delhi | Statehood | AAP | elections in delhi

Arvind kejriwal wants greece style vote on full statehood for delhi

Kejriwal, Delhi, Statehood, AAP, elections in delhi

Chief Minister Arvind Kejriwal has reportedly written to Delhi's Urban Development Department to explore how a Greece-style referendum can be held in the capital on the issue of full statehood.In the note sent last month, sources said, Mr Kejriwal sought a feasibility report on how the capital's people can be asked to vote on whether Delhi should be accorded full statehood and has also discussed it with his ministers.

ఇక ఢిల్లీలో రెఫరెండం.. ఢిల్లీకి రాష్ట్ర హోదా కోసం

Posted: 07/06/2015 04:46 PM IST
Arvind kejriwal wants greece style vote on full statehood for delhi

గ్రీస్ లో నిర్వహించిన మాదిరిగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా రిఫరెండం సేకరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రం హోదా కల్పించాలనే అంశంపై గ్రీస్ తరహాలో ప్రజాభిప్రాయ సేకరించడానికి గల అవకాశాలను పరిశీలించాలని ఢిల్లీ పట్టణాభివృద్ధి విభాగానికి ఆయన గత నెలలో ఓ లేఖ కూడా రాశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దాంతో పాటుగా ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్రం హోదా ఇవ్వాలన్న అంశంపై ప్రజలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉండవచ్చని కూడా ఆయన తన కేబినెట్ మంత్రులతో చర్చించారట. ‘ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాపై ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆశిష్ ఖైతాన్ సోమవారంనాడు వ్యాఖ్యానించారు.

Also read:  కేజ్రీవాల్ కు కేంద్రం షాక్.. ఇదే ఫైనల్ అంటూ గెజిట్

ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా ఇంతవరకూ పూర్తి స్థాయి రాష్ట్రంగా లేదు. పోలీసు వ్యవస్థ లాంటి అత్యంత కీలకమైన విభాగం ఇంకా కేంద్రం చేతిలోనే ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా లెఫ్ట్-నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో నజీబ్ జంగ్- సీఎం కేజ్రీవాల్ మధ్య తరచుగా వివాదాలు వస్తున్నాయి. కొన్ని కీలకమైన అపాయింట్ మెంట్ల విషయంలో వీరిద్దరి మధ్యా గత కొద్ది నెలలుగా గవర్నర్- సీఎం మధ్య వివాదాలు నెలకొన్నాయి.

Also Read:  ఆమ్ ఆద్మీ కరెంట్ బిల్ లక్షా ముప్పై ఐదు వేలు

అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రం హోదా సాధిస్తామన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన హామీలలో ఒకటి. దాంతో ఆప్ పార్టీ ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీని కేవలం 3 సీట్లకు పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ ఢిల్లీ రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో తలదూరుస్తోందని, తమపై పగ తీర్చుకునే ధోరణితో వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించిన తరువాత ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కోసం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్-నాథ్ సింగ్-లతో చర్చించేందుకు అపాయింట్ మెంట్ కోరారు. అయితే వారు అందుకు నిరాకరించారు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kejriwal  Delhi  Statehood  AAP  elections in delhi  

Other Articles