రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్-8 విధించేందుకు తాను వ్యతిరేకమని సినీనటుడు, జన సేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో సీమాంధ్ర ప్రజల మాన ప్రాణాలకు ఏదైనా ఆపద ఏర్పడితే సెక్షన్ 8 దానంతట అదే అమలుకు నోచుకుంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో శాంతిభద్రతలు అదుపులోనే వున్నాయని అన్నారు. రాష్ట్రం విడిపోయింది. ఒకరికి కంట్లో వెన్న పెడితే.. మరోకరి కంట్లో కారం పెట్టినట్లుగా విభజన జరిగిపోయింది. ఇక సెక్షన్ 8 పేరుతో మరోసారి కేంద్రానికి అధికారం కట్టబెట్టిస్తే.. అప్పుడు తెలంగాణ కూడా అన్యాయం చేసిన వాళ్లు అవుతారని, కేంద్రం మరో పెద్ద తప్పు చేసినట్లు అవుతుందన్నారు.
ఉద్యమాల్లో వున్నప్పుడు కేసీఆర్ ఏమైనా మాట్లాడవచ్చు.. కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో వున్న ప్రజలందరినీ సమానంగానే చూడాలని పవన్ సూచించారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. తెలుగు రాష్ట్రమే విడిపోయింది తప్ప.. మరో దేశంగా విడిపోలేదని, మనమంతా భారతీయులమే.. మనందరిదీ భారత జాతి అనే భావన కల్పించాల్సిన బాధ్యత కేసీఆర్ పై వుందన్నారు. 60 ఏళ్లుగా హైదరాబాద్ ఆంధ్రులకు రాజధాని అందుకే హైదరాబాద్ తో అంతగా అనుబంధముందని పవన్ అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలను కేంద్రం పరిష్కారించాలని అందుకు గాను పార్లమెంటరీ కమిటీ వేయాలని పవన్ కల్యాన్ సూచించారు. అధికార, విఫక్ష సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి.. వారు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ కమిటీ కూడా పరిష్కరించలేని సమస్యలపై, రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు ఏర్పడిన సమయాల్లోనూ కమిటీ నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయానికి పిర్యాదు చేసేలా వుండాలని ఆయన కోరారు. ఇందుకోసం పార్లమెంటరీ కమిటీలో సీనియర్ ఐఎఎస్ అధికారి వుండేలా కూడా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more