Sandra Venkata Veeriah | Custody | ACB | cash for vote case

Court order to custoday for sandra venkata veeriah who accused in cash for vote case

Sandra Venkata Veeriah, Custody, ACB, cash for vote case

Court order to Custoday for Sandra Venkata Veeriah who accused in cash for vote case. Telangana ACB file petetion to give custody sandra for them.

సండ్రకు కస్టడీ.. ఐదు కాదు రెండు రోజులే

Posted: 07/08/2015 04:39 PM IST
Court order to custoday for sandra venkata veeriah who accused in cash for vote case

ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సండ్ర వెంకటవీరయ్యను రెండు రోజులపాటు కస్టడికి అప్పగిస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది. నిజానికి ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని తెలంగాణ ఏసీబీ కోరినా కోర్టు మాత్రం కేవలం రెండు రోజులు మాత్రమే కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. అయితే అంతకు ముందే కోర్టు సండ్రకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఓటుకు నోటు కేసులో మరింత సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా సండ్రను ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ వేసింది. సండ్ర అరెస్ట్ అక్రమమని.. ఆయనకు బెయిల్ ఇప్పించాలని కోరుతూ సండ్ర ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. సండ్ర వీరయ్య ఇదే కేసులో మరో నిందితుడు  సెబాస్టియన్‌తో మాట్లాడిన ఆడియో నివేదికను ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో మరోసారి వేం నరేందర్‌ రెడ్డిని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

అయితే ఓటుకు నోటు వ్యవహారం మొత్తం నెరిపింది సండ్రనే అని ఏసీబీ వాదిస్తోంది. కాగా ఏససీబీ విచారణకు హాజరైన  సండ్ర ఎలాంటి వివరాలను వివరించడలేదని కాబట్టి తమకు ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని ఏసీబీ కోరింది. సెబాస్టియన్ తో మాట్లాడింది సండ్రనే అని అలాగే జనార్వన్ అనే వ్యక్తి నేతృత్వంలోనే ఓటుకు నోటు వ్యవహారం మొత్తం నడిచిందని ఏసీబీ ఆరోనిస్తోంది. అయితే జనార్దన్ ఎవరు..? సండ్రకు ఇంకెవరితో కాంటాక్ట్ లు ఉన్నాయని కూడా ఏసీబీ విచారించనుంది. అయితే సండ్ర బెయిల్ పిటిషన్ రేపు విచారణకు స్వీకరించనుంది కోర్టు. ఒకవేళ బెయిల్ లభిస్తే సండ్ర కస్టడీ తర్వాత బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే సండ్ర ఎవరి పేర్లు చెబుతారు..? ఎలాంటి వివరాలను వెల్లడిస్తారు అన్నది ఆసక్తిగా ఉంది.

By Abhinavachary

Also Read :  చేసింది మొత్తం సండ్రనే.. ఇవిగో ఆధారాలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sandra Venkata Veeriah  Custody  ACB  cash for vote case  

Other Articles