KCR Welcomes D Srinivas, Supporters Into TRS With Pink Kanduva

Senior congress leader d srinivas joins ruling trs in telangana

KCR Welcomes D Srinivas, Supporters Into TRS With Pink Kanduva, I am welcoming by brother into TRS , KCR welcomes D Srinivas into TRS, D Srinivas joins into TRS, DS, fire, congress leaders, CM KCR, Telangana, Congress, salute, TRS, politics, D. Srinivas

Telangana Chief Minister KCR said that he is welcoming his brother DS into the party and spoke at length about his association with DS since their early days.

డీఎస్ కు తమ్మడిలా సాదరంగా పార్టీలోకి అహ్వానిస్తున్నా.. కేసీఆర్

Posted: 07/08/2015 11:08 PM IST
Senior congress leader d srinivas joins ruling trs in telangana

తనకు అండగా ఉంటానని టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన డీఎస్‌కు ఓ తమ్ముడిలా తాను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాని, అతనికి మనస్పూర్తిగా సెల్యూట్ చేస్తున్నానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. డీఎస్ టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కేసీఆర్ప్రసంగిస్తూ.. డీఎస్‌తో తనకు 35 ఏళ్ల నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. తనకు, డీఎస్ లాంటి వ్యక్తికి పదవులు లెక్క కాదన్నారు. తాము ఎన్ని పదవులు అనుభవించలేదు. పదవులు అనేవి శాశ్వతం కాదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంచేతల ప్రభుత్వమనే భావనతోనే డీఎస్ మాతో కలిశారు. ప్రతీ విషయంలోనూ డీఎస్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. డీఎస్ సూచనలు, సలహాలతో ముందుకెళ్దామని చెప్పారు.

డీఎస్ చేరికను నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా ఆహ్వానించారన్నారు. డీఎస్ చేరికపై పోచారంతో పాటు ఎమ్మెల్యేలను సంప్రదించగా.. మంచి నిర్ణయమని చెప్పారన్నారు. డీఎస్ లాంటి వ్యక్తులు పార్టీలోకి వస్తు తమకు పెద్ద దిక్కుగాఉంటారని పార్టీ నేతలు అన్నారని కేసీఆర్ చెప్పారు. ఉద్యమ సమయంలో డీఎస్ తనతో టచ్‌లో ఉండి అన్ని సమస్యలపై మాట్లాడేవారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు డీఎస్ ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. డీఎస్ సంస్కారం గల వ్యక్తని..చిల్లరమల్లరగా మాట్లాడే అలవాటు ఆయనకు లేదన్నారు. అలాంటి వ్యక్తి పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. ఆయనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.

అంతకుముందు టీఆర్ఎష్ లో చేరిన డి.శ్రీనివాస్ మాట్టాడుతూ.. పార్టీ మారుతున్నానని ప్రకటించిన నాటి నుంచి తనను పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు.. వారిని తాను విమర్శించదలుచుకోలేదని డీఎస్ స్పష్టం చేశారు. తన ఆత్మప్రబోధాను సారం నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తాను బీ-ఫారం ఇస్తే గెలిచిన ఇవాళ తననే తిడుతున్నారు. వారికి సమాధానం చెప్పాల్సిన అసవరం లేదు. తన వెంబడి వచ్చిన ప్రతీ నేతకు, కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పారు. బంగారు తెలంగాణలో తన వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు. ఇబ్బందికర పరిస్థితిలో బాగా ఆలోచించి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చిందని ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారని... ఆ తర్వాత కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టి ఉద్యమం చేపట్టి తెలంగాణ సాధించారని ఆయన అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  Telangana  Congress  salute  TRS  politics  D. Srinivas  

Other Articles