రాజస్థాన్లోని దారుణం జరిగింది. తన కుటుంబాన్ని అదుకోవాలని ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న ఓ యువతికి ఉద్యోగం ఇస్తానని చెప్పిన కాంట్రాక్టర్ అమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రతినిత్యం దేశంలో ఏదో ఒక మూల ప్రతీ రోజు అత్యాచార ఘటనలు జరుగుతూనే వున్నాయి. కామంతో రగిలిపోతున్న కామపిశాచులు తిరిగుతున్న దేశంలో మహిళలకు భద్రత కూడా కరువైంది. తాజగా రాజస్థాన్ లో ఓ 18 ఏళ్ల యువతిని మత్తుమందు ఇచ్చిన ఓ కాంట్రాక్టర్ అమెపై . గత 40 రోజులుగా ప్రతీరోజు అత్యాచారానికి తెగబడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. మే 27న షోయ్పూర్కు చెందిన 18 ఏళ్ల యువతి ఇంటి నుంచి అదృశ్యమైంది. అదే రోజు గిరిరాజ్ బైర్వా అనే కాంట్రాక్టర్ను కలిసి ఉద్యోగం కావాలని అడిగింది. ఇదే అదునుగా భావించిన కాంట్రాక్టర్ ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇక నాటి నుంచి 40 రోజుల పాటు ఆ యువతిపై అత్యాచారం పాల్పడ్డాడు. అయితే యువతి కాంట్రాక్టర్ నుంచి తప్పించుకుంది. స్తానికంగా వున్న ధన్వంతరి అసుపత్రి నుంచి అమె పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అమెను వైద్య పరీక్షఃలు, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి దేహం నిండా గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కోసం వేట ప్రారంభించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more