వికీలీక్స్ వెల్లడించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ట్యాపింగ్ కోసం సింగపూర్ హ్యాకింగ్ టీమ్‌కు... ఏపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, వారి తొత్తులుగా ఉన్న చానెళ్ల కుట్ర చేస్తున్నాయని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కథనాలకు, మెయిల్స్‌కు సంబంధించి... ఏపీ ప్రభుత్వానికి సబంధంలేదని మంత్రి యనమల స్పష్టం చేశారు.
కాగా, ఓటుకు నోటు కేసు చిక్కుల నుంచి బయటపడక ముందే చంద్రబాబు ప్రభుత్వంపై అత్యంత తీవ్రమైన ఆరోపణ ఆయనపై వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందనే వికీలీక్స్ కథనం ఆయనను వివాదంలోకి నెట్టింది. ఓటుకు నోటు కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్నే తన వాదనకు ఆలంబనగా చంద్రబాబు తెచ్చుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై ఎపి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై సిట్ విచారణకు కూడా ఆదేశించింది. ఈ స్థితిలో చంద్రబాబును అదే సమస్య చుట్టుముట్టడం చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలు వ్యవహారంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more