GoldRate | Gold | Indian Gold | Gold price

Gold rates are falling down and may price will reach to twenty thousand five hundred

GoldRate, Gold, Indian Gold, Gold price, Gold rate today, Gold rate in Hyderabad

Gold rates are falling down and may price will reach to twenty thousand five hundred. From past few days godl price was fallling down by the international market effect.

పది గ్రాముల బంగారం ధర 20 వేల 500..?

Posted: 07/31/2015 08:32 AM IST
Gold rates are falling down and may price will reach to twenty thousand five hundred

బంగారం ధరలు పుత్తడి ప్రియులకు ఆనందం కల్గిస్తుండగా బంగారం వ్యాపారులకు  నిద్ర లేకుండా చేస్తున్నాయి.  కాలంగా అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో జరుగుతున్న  లావాదేవీల ప్రభావంతో పసిడి ధర రోజు రోజుకూ తగ్గుముఖం పడుతుంది.  వారం రోజుల క్రితం వరకు నగరంలోని బంగారం దుకాణాలు వినియోగదారుల రాక అంతతంత మాత్రంగా ఉండటంతో సాధారణ స్థాయిలో క్రయవిక్రయాలు జరిగాయి.   నాలుగు రోజుల నుంచి పుత్తడి ధర పడిపోవడంతో  పసిడి ప్రియులు కొనుగోలు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read:  ఫెడ్ రిజర్వు నిర్ణయమే కీలకం..రూ.20 వేలకు స్వర్ణం చేరుతుందని అంచనా
Also Read:  బంగారం ధర 23వేలకు దిగిరావచ్చు

గత పది రోజుల క్రితం 10గ్రాముల కేడీఎం  26వేల రూపాయలు ఉండగా  ప్రస్తుతం 23, 500 ఉంది. వారం రోజుల వ్యవధిలోనే సుమారు 2వేల నుంచి 2500 వరకు తగ్గుముఖం పట్టింది. రానున్న మరో వారం రోజుల్లో పది గ్రాముల బంగారం 21 వేయిలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు వ్యాపారస్తులు అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనా పండుగల ముందు పసిడి ధర తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. నీ ఇల్లు బంగారం గానూ అంటూ సామాన్య, మధ్య తరగతి వారిని సైతం ఊరిస్తున్నాయి. చాలా కాలం తరువాత బంగారం ధరలు తగ్గడంతో ఆడవారి ముఖాలు కళకళలాడుతున్నాయి. చాలా రోజుల నుంచి బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్న వారు ఇదే మంచి తరుణమని బావిస్తున్నారు. మరి కొంతమంది ఇంకా తగ్గుతుందని వేచి చూసే ధోరణిలో ఉంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన పరిణామాల వల్ల ధర దిగొస్తొందని మార్కెట్ విశ్లేకులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు భారతీయ మార్కెట్‌ను ప్రభావితం చేసే సీజన్‌పైనే దృష్టి పెట్టాలని వారు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GoldRate  Gold  Indian Gold  Gold price  Gold rate today  Gold rate in Hyderabad  

Other Articles