High Alert In India | Terrorists Attack | Independence Day | Hyderabad | International Airports

Independence day terrorists attack hyderabad airport central govt

terrorists attack, independence day, hyderabad airport, india, central govt, 26/11 attacks, ib intelligence bureau

Independence Day Terrorists Attack Hyderabad Airport Central Govt : Intelligence Bebureau says terrorists will attack on independence day. Central Govt Alerts All India Wide.

‘ఉగ్ర’దాడులపై వార్నింగ్.. దేశవ్యాప్తంగా హై అలర్ట్

Posted: 08/14/2015 07:58 AM IST
Independence day terrorists attack hyderabad airport central govt

మొన్న పంజాబ్, ఆ తర్వాత కాశ్మీర్ లో పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులు చేసి, కొందరి ప్రాణాలను పొట్టనపెట్టుకుని తీవ్ర కలకలం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఇండియాపై దాడులు చేస్తారేమోనన్న విషయమై విచారణ జరపగా.. 26/11 తరహా కంటే మరింత బీభత్సంగా వాళ్లు దాడులకు పాల్పడే అవకాశం వుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు విచుకుపడే ప్రమాదం వుందని ఇంటలిజెన్స్ బ్యూరో అనుమానిస్తోంది. అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

దీంతో వెంటనే స్పందించిన కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆలయాలు, జనసమ్మర్ధంగా ఉంటే షాపింగ్ మాల్స్ లక్ష్యంగా ఉగ్రవాదులు పేట్రేగేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఐబీ హెచ్చరించింది. అంతేకాదు.. సముద్ర, వాయు మార్గాల ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు యత్నించే అవకాశాలున్నట్లు తెలిపింది. ఈ విధంగా ఐబీ హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీతోపాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదు, తమిళనాడు రాజధాని చెన్నై తదితర నగరాలతోపాటు దేశవ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

ఈ క్రమంలోనే హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పోలీసు భద్రత పెరిగింది. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు ఎయిర్ పోర్టులోకి సందర్శకులకు పాసుల జారీని నిలిపివేశారు. ఈ తరహాలోనే అన్ని రాష్ట్రాల్లో వుండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తనఖీలు చేస్తున్నారు. ప్రజలు కూడా ప్రతిక్షణం అప్రమత్తంగా వుండాలని భద్రతా సిబ్బంది సూచించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : terrorists attack  independence day  

Other Articles