Telangana ACB Submits Revanth Reddy, Sandra Voice Samples To Court | Note For Vote

Revanth reddy voice sample note for vote telangana acb

note for vote, revanth reddy, sandra, telangana acb, telangana assembly, phone tapping, matthaya, sebastian

Revanth Reddy Voice Sample Note For Vote Telangana ACB : Telangana ACB Submits Revanth Reddy, Sandra Voice Samples To Court In Note For Vote

‘ఓటుకు నోటు’లో కోర్టుకు చేరిన రేవంత్, సండ్ర స్వరనమూనాలు

Posted: 08/14/2015 08:29 AM IST
Revanth reddy voice sample note for vote telangana acb

రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో తెలంగాణ ఏసీబీ తన దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ప్రమేయముందని పలువురిని విచారించిన ఏసీబీ.. టీ-టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా ఆమధ్య అరెస్ట్ చేసింది. అలాగే.. ఈ కేసులో కీలక సాక్ష్యాలైన వారి ఆడియో, వీడియో టేపుల వాస్తవికతను నిర్ధారిస్తూ రూపొందిన ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కూడా ఏసీబీ కోర్టుకు చేరింది. ఇప్పుడు తాజాగా ఆ టేపుల్లో వుండే స్వరాలతో నిందితుల స్వరాలను పరిశీలించే ప్రక్రియ తెరమీదకి వచ్చింది.

ఈ ‘ఓటుకు నోటు’ కేసులో ప్రధాన నిందితుడు అయితే రేవంత్ రెడ్డితో పాటు సండ్ర స్వర నమూనాలను అందించాలని ఏసీబీ కోర్టు అభ్యర్థించిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ స్పందించింది. ఈ నేపథ్యంలోనే ఆయా సందర్భాల్లో రేవంత్, సండ్రలు ప్రసంగించిన ఆడియో ఫుటేజీలను అసెంబ్లీ అధికారులు కోర్టుకు సమర్పించారు. అదే సమయంలో కేసులో మరో కీలక నిందితుడిగా వున్న జెరూసలెం మత్తయ్యతోపాటు మరో నిందితుడు సెబాస్టియన్ లు వివిధ సందర్భాల్లో మీడియాతో మాట్లాడిన ఆడియో ఫుటేజీలను కూడా ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించారు. అసలు టేపులతో నిందితుల స్వరాలను పోల్చేందుకు అందిన స్వరనమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని ఏసీబీ అధికారులు గురువారమే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై కోర్టు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అటు ‘ఫోన్ ట్యాపింగ్’ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కూడా దూసుకుపోతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  telangana acb  note for vote  

Other Articles