దక్షిణ ఢిల్లీలో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎంతో వేగంగా దూసుకుపోయే లాంబోర్గిని గల్లార్డో కారు వున్నట్లుండి మంటల్లో చిక్కుకుంది. ఆ కారును నడుపుతున్న డ్రైవర్ క్షేమంగానే బయటపడ్డాడు కానీ.. కారు మాత్రం సగానికిపైగా కాలిపోయింది. ఇటలీకి చెందిన ఆ కారు విలువ ఎంతో తెలుసా..? అక్షరాలా రెండున్నర కోట్లు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే ఆ కారు.. వున్నట్లుండి మంటల్లో చిక్కుకుపోవడంతో మొత్తం రెండున్నర కోట్లు బూడిదపాలైనట్లైంది. ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
ఇటలీ కంపెనీకి చెందిన లాంబోర్గిని గల్లార్డో అనే కారును దాని యజమాని రూ.2.5 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. దీనికి 5.2 లీటర్ల ఇంధన పరిమాణంతో ఇంజిన్ ఉంటుంది. ఈ కారు డ్రైవర్ సోమవారం ఉదయం దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని బదర్పూర్ నుంచి వస్తుండగా అనూహ్యంగా అందులో అనుకోకుండా మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అతడు అందులో నుంచి ఎలాంటి గాయాలవకుండా సురక్షితంగా బయటపడ్డాడు. కారు వెనుక భాగంలో మంటలు రేగడంతో ఆ కారు సగానికిపైగా పూర్తిగా కాలిపోయింది. ఇంతలోనే ఫైరింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, దాని మంటలు ఆర్పేడానికి ప్రయత్నించినప్పటికీ సగం కారు మాత్రమే మిగిలింది. ఏదైతేనేం.. అతని కళ్లముందే రెండున్నర కోట్లు బూడిదైంది. 2013లో బయటకు వచ్చిన ఈ కార్లు.. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more