Delhi Girl Jasleen Kaur File Complaint Against Man Who Harasse Her On Road At Red Signal | Delhi Crime News

Delhi girl file complaint against man who harasse her on road at red signal

delhi crime news, delhi girl jasleen kaur, jasleen kaur file case against man, delhi girl file case against man, delhi rape case, women rape case, delhi crime

Delhi Girl File Complaint Against Man Who Harasse Her On Road At Red Signal : A Delhi Girl Named Jasleen Kaur File Complaint Against Man Who Harasse Her On Road At Red Signal

‘కంప్లయింట్ ఇచ్చి చూడు.. అప్పుడు నీ సంగతి చెబుతా’

Posted: 08/24/2015 05:51 PM IST
Delhi girl file complaint against man who harasse her on road at red signal

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతూనే వున్నాయి. మగమృగాలు రానురాను మరి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో కూడా.. ఢిల్లీ కేవలం దేశానికి రాజధాని మాత్రమే కాదు, అత్యాచారాలకు అడ్డా అని కూడా వెల్లడైందంటే అక్కడి మహిళల పరిస్థితి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు.. రకరకాల వేధించడం మొదలుపెట్టేస్తారు. తాజాగా మరో సంఘటన ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఢిల్లీలోని తిలక్ నగర్ లో బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి.. జస్లిన్ కౌర్ అనే మహిళను వేధింపులకు గురిచేయడమే కాకుండా అనకూడని మాటలు అన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె.. ఏమాత్రం భయపడకుండా అతని ఫోటో తీసుకుని, పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఆమె ఫోటో తీస్తున్న క్రమంలో ‘ఫోటో తీస్కోని నీ దిక్కున్న చోట చెప్పుకోపో’ అన్నంతగా వ్యవహరించాడు కూడా. అతని పొగరుని ఎలాగైనా అణచాలని భావించిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆమె జరిగిన తతంగాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పేర్కొంది. ఆ వ్యక్తి ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో, తనని ఎలా ఆవేదనకు గురి చేశాడో వివరించింది.

‘రాత్రి 8.30 గంటల సమయంలో నేను తిలక్ నగర్ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు సిద్ధమయ్యాను. రెడ్ సిగ్నల్ పడినప్పటికీ అతడు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దాంతో నేను ‘భయ్యా రెడ్ సిగ్నల్ పడింది కదా.. ఆగొచ్చు కదా’ అని సూచించాను. అప్పుడు ఆ వ్యక్తి ‘నాతో రా.. నేను నిన్ను జనక్ పురి వద్ద డ్రాప్ చేస్తాను అని అన్నాడు. ఇంకా అసభ్యంగా మాట్లాడాడు కూడా. దాంతో అతని ఫోటో తీసుకోవాడానికి ప్రయత్నించగా.. ‘ఫొటో తీస్కో.. కంప్లెయిట్ ఇచ్చి చూడు.. మరోసారి కలిసినప్పుడు ఏమవుతుందో తెలుస్తుంది’ అంటూ హెచ్చరించాడు’ అని బాధితురాలు పేర్కొంది.

ఆమె ఫిర్యాదును తీసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి వేధింపులకు పాల్పడిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇదిలావుండగా.. వేధింపులకు దిగిన ఓ వ్యక్తి ముందు ధైర్యంగా నిల్చుని అతడి ఫొటో తీస్కోని ఫిర్యాదు చేయడం పట్ల పోలీస్ కమిషనర్ జస్లిన్ ను కొనియాడారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi crime news  jasleen kaur  tilak nagar abuse case  

Other Articles