Assam | Media | ladies | Dress | Monkeys

Assam tv channel equates women in shorts to monkeys

Assam, Media, ladies, Dress, Monkeys, Over action, media news

Assam TV channel equates women in shorts to monkeys A local TV channel in Assam had to duck for cover from the whipping it got on social media and the general public for their exclusive report on scantily clad girls, calling it a summer time nuisance.

ITEMVIDEOS: అమ్మాయిల కన్నా కోతులే బెటర్..? మీడియాలో సంచలనం

Posted: 08/26/2015 09:26 AM IST
Assam tv channel equates women in shorts to monkeys

మానవుడు కోతి నుండి పుట్టాడు అని చరిత్రలో చదువుకున్నాం. కోతుల నుండి నేటి ఆధునిక మానవుడిగా మారడానికి మనకు చాలా టైం పట్టింది. అయితే అమ్మాయిలను కోతులతో పోలుస్తూ మీడియాలో వచ్చిన కథనాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మీడియా అంటేనే అతి అన్న పేరును మరింత నిలుపుతూ అస్సాంలో ఓ మీడియా చానల్ చేసిన నిర్వాకం మీడియా పరువు తీసింది. ఆడ వారి వస్త్రధారణను కోతులతో పోలుస్తూ ఉన్న ఒక వీడియో క్లిప్‌ను ప్రసారం చేసింది. అది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియో క్లిప్‌లో షార్ట్‌ వేసుకున్న కోతిని చూపించి అస్సామీలో బ్యాక్‌ గ్రౌండ్‌ వాయిస్‌లో కోతి మాట్లాడినట్లుగా అమ్మాయిలపై విమర్శలు చేసింది. ఇపుడు కోతులు కూడా బట్టలను ధరించడం నేర్చుకున్నాయి. వాటికి బట్టలను ఉతకడం కూడా తెలుసు. కాని అసోం యువతులకు మాత్రం కోతులకు తెలిసినంత వస్త్రధారణ కూడా తెలియదు అంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.  



సాంప్రదాయ వస్త్రధారణను వదిలేసిన అస్సామీ యువతులు పాశ్చాత్య వస్త్రధారణ వెంట పడుతున్నారని, బహుశా పొట్టి దుస్తులు ధరించడం వారికి సౌకర్యంగా ఉందెమో అంటూ ప్రతిధిన్‌ టైమ్‌ అనే చానెల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియోలో కురచ దుస్తుల్లో ధరించి సిటీలో తిరుగుతున్న యువతులకి చెందింది. ఈ వీడియో ప్రసారం చేసిన తర్వాత చానెల్‌ ఎదుట పౌర హక్కుల నేతలు ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించాయి. వారిలో కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియో హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. కొంతమంది యువతులు ఈ వీడియోపై మాట్లాడుతూ తాము ప్రస్తుతం పోలీసుల కంటె కూడా మీడియా దగ్గరే భయపడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. అయితే సంబంధిత చానెల్‌ వీడియోపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assam  Media  ladies  Dress  Monkeys  Over action  media news  

Other Articles