ఈ మధ్య కాలేజీల్లో విద్యార్థినులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు సంచలనం రేపుతుండగా.. తాజాగా మరో విద్యార్థిని కిడ్నాప్ కి గురికావడం కలకం సృష్టిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఓ డిగ్రీ విద్యార్థిని అదృశ్యం అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈమె కిడ్నాప్ కి గురి కావడం వెనుక ఓ బలమైన కారణముందని తల్లిదండ్రులతోపాటు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇంతకీ ఆ కారణమేంటి..? అనేది తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం పాలమాకులపల్లికి చెందిన లౌకిక అనే విద్యార్థిని ఐదు రోజుల క్రితం కిడ్నాప్ కి గురైంది. కిడ్నాప్ కు గురికావడానికి ముందు ఆమె కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే.. సాయంత్రం ఎంతసేపటికి ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమె ఆచూకీ కోసం గాలించారు. ఆమె స్నేహితులను కూడా సంప్రదించారు. కానీ.. ఫలితం లేకపోవడంతో చివరికి వారు పోలీసులను ఆశ్రయించారు. తమ కూతురు కిడ్నాప్ కు గురైందని బాధుతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తొలుత పోలీసులు ఈ ఫిర్యాదును ఏమాత్రం పట్టించుకోలేదు కానీ.. తాజాగా మీడియాలో ఓ విద్యార్థిని కిడ్నాప్ కు గురైందన్న వార్తలు రావడంతో వారు వెంటనే రంగంలోకి దిగి, కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ కిడ్నాప్ వెనుక అసలు కారణాలేంటోనన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేయగా.. ఓ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి రవికి, అదే గ్రామానికి చెందిన బాషా అనే వ్యక్తికి మధ్య చిట్టీల వ్యాపారానికి సంబంధించి వివాదం నడుస్తోందని తెలిసింది. ఆ వివాదం కారణంగానే విద్యార్థిని లౌకికను బాషానే కిడ్నాప్ చేసి వుంటాడని అనుమానిస్తున్నారు. కిడ్నాప్ కు గురైన విద్యార్థిని తండ్రి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు.. ఈ కిడ్నాప్ వెనుక మరో కారణమేమైనా వుందా..? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more