Dokka Manikya Vara Prasad joins TDP in presence of Chandrababu Naidu

Ex minister dokka manikya vara prasad joins tdp

Dokka Manikya Vara Prasad, TDP Chandrababu Naidu, rayapati sambashiva rao, former minister dokka joins tdp,

Dokka Manikya Varaprasad a Congress leader and he even served as the Minister in united AP, has taken the shelter of TDP in the presence of CM Chandrababu Naidu.

ITEMVIDEOS: చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న డోక్క

Posted: 08/30/2015 02:32 PM IST
Ex minister dokka manikya vara prasad joins tdp

మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాల్లాడుతూ.. ఎవరైనా రాష్ట్రాభివృద్దికి కంకణం కట్టుకున్న వారు టీడీపీ పార్టీలోకి చేరాలనుకుంటే వారిని సాధరంగా ఆహ్వానిస్తానని చెప్పారు. ప్రజలకు న్యాయం జరగాలన్న కాంక్షతోనే డోక్కా మాణిక్యవరప్రసాద్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. అలాంటి మధ్యలో అగకూడదని ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించానని చంద్రబాబు చెప్పారు అనంతరం డోక్క మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ.. తాను నిత్యం పేద ప్రజల అభ్యున్నతిని కాంక్షించానని. వారి కోసమే తాను రాజకీయ అరంగ్రేటం చేశానని చెప్పారు. తాను ఏ పార్టీలో వున్నా తన గొంతు నిత్యం పరితపించేది పేదల కోసమేనన్నారు.



తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీ రామారావుకు తాను అభిమానని కూడా డొక్కా చెప్పుకోచ్చారు. అయితే డొక్కా మాణి్క్యవరప్రసాద్ టీడీపీ పార్టీలో చేయడం వెనుక నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరాలు కీలక పాత్ర పోషించారు. మొదటి నుంచి డొక్కా రాయపాటికి శిష్యుడుగా ఉంటూ వచ్చారు. తన రాజకీయ నిర్ణయాలు అన్నీ రాయపాటి సూచించిన మేరకే డొక్కా అనుసరిస్తుంటారు. కాగా ఇటీవల డొక్కా వైసీపీలో చేరుతారనే ఊహాగానాలు రావడంతో రాయపాటి చొరవ తీసుకుని డొక్కా టీడీపీలో చేరేలా ఒప్పించారు. నిన్న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడును రాయపాటి కలిసి ఈరోజు అపాయింట్‌మెంట్‌ తీసుకున్న డొక్కా మాణిక్యవర ప్రసాద్.. తన అనుచరగణంతో టీడీపీలోకి చేరారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dokka Manikya Vara Prasad  TDP Chandrababu Naidu  rayapati sambashiva rao  

Other Articles