Land Bill Will Lapse Tomorrow, I Have Agreed: PM Modi on Mann Ki Baat

Will allow land bill to lapse pm modi on mann ki baat

Land bill Land acquisition bill Prime Minister Narendra Modi Mann Ki Baat,Narendra Modi,Modi radio programme,PM Modi,Modi on land acquisition,land bill,Modi on land bill,land ordinance

Facing stiff resistance over the land acquisition bill, Prime Minister Narendra Modi announced on Sunday the government would not re-promulgate an ordinance that expires Monday.

భూసేకరణ చట్ట సవరణపై కేంద్రం వెనక్కు.. మన్ కీ బాత్ లో ప్రధాని స్పష్టీకరణ

Posted: 08/30/2015 03:26 PM IST
Will allow land bill to lapse pm modi on mann ki baat

దేశవ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా కార్షక వర్గాల నుంచి వ్యక్తం అవుతున్న వ్యతిరేకతను అర్థం చేసుకున్న కేంద్ర.. భూ సేకరణ చట్టానికి చేసిన సవరణలపై వెనక్కు తగ్గింది. గత ఏడాది కాలంగా సవరించిన చట్టాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో అమోదింపజేయాలనుకుని నిరాశకు గురైన కేంద్రం.. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ అంశంలో విపక్షాలకు, రైతులకు తలొగ్గింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్సష్టం చేశారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో భూసేకరణ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌ ముందుకు తెచ్చామని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ఆల్‌ ఇండియా రేడియోలో ప్రసారం అయింది. భూసేకరణ బిల్లు విషయంలో రైతుల ప్రయోజనాలు కాపాడే సలహాలను స్వీకరిస్తామని మోదీ అన్నారు.

జై జవాన్‌, జై కిసాన్‌ అనేది కేవలం నినాదం కాదని.. అది మన మంత్రమని ఆయన అన్నారు. భూసేకరణ సహా పలు అంశాలపై దుష్ర్పాచారం చేయడం శోచనీయమని మోదీ అన్నారు. ప్రజలందరూ జన్‌ ధన్‌ యోజన పథకాన్ని విజయవంతం చేశారని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. దీని కింద 18 కోట్ల మంది బ్యాంక్‌ ఖాతాలు తెరిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జన్‌ ధన్‌ యోజన కింద బ్యాంకు ఖాతాల్లో రూ. 70 కోట్లు జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే భూ సేకరణ విషయంలో విపక్షాలు ఇప్పటికే పెద్ద ఎత్తున అందోళన చేసిన నేపథ్యంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావించి.. ప్రతీ సారి ప్రధానిని, బిజేపీ పార్టీని ఇరుకున పెడుతున్న నేపథ్యంలో కేంద్రం దీనిని ఉపసంహరించుకుంటుందని రాజకీయ విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles