ఆర్టీసీ గురించి ఎవరిని అడిగినా.. ముందు చెప్పేది ఆర్టీసీకి వస్తున్న నష్టాల గురించే. ఎంతో కాలంగా వింటూ వస్తున్న ఆర్టీసీ నష్టాల మీద ఇప్పటి వరకు వచ్చిన అన్ని ప్రభుత్వాలు తూతూ మంత్రంగా చర్యలకు దిగాయి. ఎన్ని సార్లు, ఎన్ని కమిటీలు ఆర్టీసి ప్రభుత్వం ఊతమివ్వాలని నివేదికలు సమర్పించినా కానీ ఎలాంటి మార్పు రాలేదు. అయితే ఆర్టీసీ మీద ముందు నుండి విజన్ ఉన్న కేసీఆర్.... తెలంగాణ ఆర్టీసీని నష్టాల కడలి నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కర్ణాటక మాదిరిగా టిఎస్ఆర్టీసీని కూడా స్థానిక సంస్థలకు అప్పగించి లాభాల బాటలో నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ మొత్తాన్ని ఉద్దరించడం ఇప్పటికిప్పుడు సాధ్యంకాని నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆర్టీసీ మీద కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ మధ్యాహ్నం నుండి ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ ఆర్టీసి నష్టాల మీద కూడా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ పరిధిలొ ఉన్న ఆర్టీసీ మీద ప్రకటన చేశారు. ఆర్టీసీ 218 కోట్ల నష్టంతో నడుస్తోందని..హైదరాబాద్‌లో ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని జీహెచ్ఎంసీ భరించాలని కేబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు. హైదరాబాద్‌లో 3,800 బస్సులు నడుస్తున్నయని అన్నారు. టీఎస్ఆర్టీసీ లో జీహెచ్ఎంసీ కమిషనర్ బోర్డు డైరెక్టరేట్‌గా ఉంటారన్నారు. మొత్తానికి ఆర్టీసీని కష్టాల కడలి నుండి తప్పించేందుకు కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీకి భారాన్ని తగ్గించడమే కాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో ఆర్టీసీ సేవలను మరింత విసృతం చెయ్యడానికి సహకరిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more