తెలంగాణలో మద్యం పాలసీ మార్పుతో లిక్కర్ ఏర్లైపారుతుందని.. దానిని వ్యతిరేకిస్తూ చేసిన వామపక్షాల పోరాటం ఫలించింది. ప్రస్తుతానికి పాత మద్యం విధానాన్ని మాత్రమే అమలు చెయ్యాలని, కొత్త పాలసీ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో మద్యం విరివిగా లభించేలా, చదక మద్యం అందరికి అందుబాటులో ఉండేట్లు తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలనుకున్న ప్రతిపాదన మీద సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమూంది. దాంతో ప్రస్తుతానికి కేసీఆర్ ప్రభుత్వం చీప్ లిక్కర్ అమ్మకం మీద, తాజాగా తీసుకురావాలనుకున్న మద్యం పాలసీ మీద కూడా వెనక్కి తగ్గింది.
చీప్‌లిక్కర్ అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విరమించుకున్నారు. సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు కొనసాగిన కాబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ చీప్‌లిక్కర్ అంశంపై మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. సీఎంకు వారు చీప్‌లిక్కర్ వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. తొలి దశలో 60 వేల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి 4వేల ఇళ్ల చొప్పున కేటాయించనున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 24 నుంచి ఆరు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు...
* డబుల్ బెడ్ రూం ప్లాట్ ల నిర్మాణానికి 3వేల900కోట్ల రూపాయలు విడుదల
*మార్కెట్ కమిటీల్లో మొదటిసారిగా దేశంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్ కమిటీల్లో 50శాతం రిజర్వేషన్ అమలు
* ఉద్యోగ నియమకాల్లో వయోపరిమితిని 34 నుండి 44కు పెంపు
* హైదరాబాద్ లో ఉన్న ఆర్టీసీని జిహెచ్ఎంసీకి బాధ్యతలు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం
* వ్యాట్ చట్టంలో మార్పులు చేయాలని టీఎస్ మంత్రివర్గం నిర్ణయం
* తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ ఏర్పాటుకు ఆమోదం
* తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటుకు ఆమోదం
* ఉద్యోగుల డీఏ మంజూరుకు, రాష్ట్ర సహకార బ్యాంకు ఏర్పాటుకు ఆమోదం
* వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి మంత్రివర్గం తీర్మానం
* వృత్తి పన్ను చట్టాన్ని రాష్ట్రానికి వర్తింపజేయాలని, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లను లాటరీ పద్ధతిన చేపట్టాలని నిర్ణయం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more