chandrababu | Revenue | Employees

Chandrababau naidu fired on revenue employess

Chandrababu naidu, Revenue Department, Employees, Chandrababu fire on employees, AP, Revenue employees

Chandrababau Naidu fired on Revenue employess. He called for corruption free revenue department in AP. He also said employees has to take govt schemes into the public.

చంద్రబాబు తిట్లు.. గరంగరం

Posted: 09/18/2015 01:45 PM IST
Chandrababau naidu fired on revenue employess

ముక్కు మీద కోపానికి కేరాఫ్ చంద్రబాబు నాయుడు. ఏపి సిఎంగా గతంలో చంద్రబాబు నాయుడు ఉద్యోగస్తులతో ఎంత కఠినంగా వ్యవహరించారో అందరికి తెలసు. అసలు ఉద్యోగులకు చంద్రబాబు నాయుడకు మధ్య చాలా రోజులు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వరకు వచ్చింది. అదే గతంలో ఆయన కొంప ముంచింది. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమై అధికారానికి దూరమయ్యారు. అయితే తాజాగా మరోసారి ఉద్యోగస్తుల మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. గతంలోనే ఉద్యోగస్తుల చేతిరుచి తెలిసిన చంద్రబాబు నాయుడులో చాలా మార్పులు వచ్చాయని అనుకున్నా కానీ అది ఎంతో కాలం నిలవడం లేదు. రెవెన్యూ అధికారుల మీద బాబు గారు గరం గరం అయ్యారు. అసలు అంతా మీరే చేశారు..మీరే.. మీరే అంటూ చిందులు వేశారు.

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ అధికారులు మారాల్సిన టైం వచ్చిందని.. అధికారులు, ఉద్యోగులు పారదర్శకంగా పనిచేస్తూ, లంచాలకు దూరంగా ఉండి, ప్రజలకు దగ్గర కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో రాష్టం రెండంకెల వృద్ధిని సాధించాలని తాను కోరుతుంటే, కొన్ని ప్రభుత్వ శాఖలు అవినీతిలో రెండంకెల వృద్ధిని సాధించాయని ఆయన అన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖపై ఉన్న అవినీతి ముద్ర తొలగించుకోవాలని సూచించారు. అధికారులే ప్రజల వద్దకు వెళ్లి అభిప్రాయాలను తెలుసుకోవాలని, పారిశ్రామిక వృద్ధిలో ఏపీని ఐదో స్థానంలో నిలపాలన్నదే తన తక్షణ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని, రుణమాఫీ సక్రమంగా జరుగుతున్నా, కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి రెవెన్యూ అధికారులను చంద్రబాబుగారు గిల్లి బుజ్జగించే ప్రయత్నం బాగానే చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles