తెలంగాణ రాష్ట్ర మిగులు బడ్జెట్ ఉన్న రెండో రాష్ట్రం.. రాష్ట్రానికి గుండె వంటి హైదరాబాద్, సిరిసంపదలు కలిగిన బొగ్గు నిల్వలు ఇలా తెలంగాణ గురించి పొగిడిన వాళ్లు ఇక మీదట తెలంగాణలోని అప్పులు లేని వ్యక్తుల జాబితా అంటూ ఒ జాబితాను విడుదల చెయ్యాలేమో. ఇంతకీ ఏంటి విషయం అంటే... తెలంగాణ రాష్ట్రానికి సంబందించి అప్పుల లెక్కల మీద తాజాగా కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. అందులో తెలంగాణ సగటు అప్పు, ప్రతి తెలంగాణ వ్యక్తి తల మీద ఉన్న అప్పు మీద చర్చ సాగుతోంది. తాజాగా వెల్లడించిన చేదు నిజాల్లో.. కేసీఆర్ గారి పుణ్యమా అని తెలంగాణ పౌరులకు అప్పు భారం పెరగింది. కేసీఆర్ చేసిన అప్పు.. తెలంగాణ పౌరులకు భారంగా మారుతోంది.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరధి కవితా.. తెలంగాణలో పుడుతున్న ప్రతి బిడ్డపై, పుట్టుకతోనే 20 వేల అప్పు భారం పడుతోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యాఖ్యానించింది. ఇండియాలో గుజరాత్ తరువాత ఆదాయం మిగులు రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పుకున్న కేసీఆర్ 61 వేల కోట్ల అప్పు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఫోరం అభిప్రాయపడింది. ఈ రుణాలను అధిక వడ్డీలకు తీసుకోవడంతో బడ్జెట్ లో వడ్డీల భారం అధికం కానుందని, దీంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముందని ఫోరం అధ్యక్షుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్పరెడ్డి హెచ్చరించారు
ఇప్పటికైనా కేసీఆర్ సర్కారు కళ్లు తెరవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ అప్పులపై తాము సమాచార హక్కు చట్టం వినియోగించి సమాచారం పొందామని ఆయన తెలిపారు. పాలనాపరమైన ఖర్చులను తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. ప్రభుత్వం 9 శాతం వడ్డీతో బాండ్లను విక్రయించి 23 వేల కోట్లు, 11 శాతం వడ్డీకి 24 వేల కోట్లు రుణాల రూపంలో తెచ్చుకుందని, వీటి ప్రభావం ఇప్పటికే ప్రజలపై పడిందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 'పెట్రో' ఉత్పత్తులపై అధిక పన్నులు వేశారని ఆయన గుర్తించారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, కొత్త ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకుంటే, వడ్డీల భారం మోయక తప్పదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more