Girl Drunk Beer in Police Station and Abuses Cops.

Girl drunk beer in police station

Mumbai, Police, Drunk Lady, Beer, Lady drunk in police station, Drink beer

Girl Drunk Beer in Police Station and Abuses Cops. In Mumbai, A girl drunk beer infront of the police men at the police station and abuse cops.

ITEMVIDEOS: పోలీస్ స్టేషన్ లో బీర్ కొట్టిన అమ్మాయి

Posted: 09/18/2015 03:46 PM IST
Girl drunk beer in police station

పోలీసులు అంటేనే తాగిన వారికి పిచ్చ భయం.. ఇక డ్రంక్ చేస్తూ డ్రైవ్ చేసే వాళ్ల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మందు బాబులు రోడ్డు మీద ఏమైనా హంగామా చేస్తే.. పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి తమ తరహాలో కోటింగ్ ఇస్తే అన్నీ సెట్ అవుతాయి. పోలీసులు ఇచ్చే కోటింగ్ కు ఎక్కిన మందు కాస్తా దిగి.. దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. కానీ అలాంటిది పోలీస్ స్టేషన్ లో కూర్చొని.. పోలీసుల ముందే బందు బాటిల్ పెట్టి.. మంచింగ్ లేకుండా.. పోలీసులతో తీరిగ్గా మాట్లాడుతూ బీర్ కొడితే ఎలా ఉంటుంది. అంత లేదు.. ఆ బీర్ బాటిల్ పగలగొట్టి.. మన మక్కెలిరగదంతారు అని అనుకుంటున్నారా..? కానీ అలాంటిదేమీ జరగలేదు. పైగా మనోడెవరో కానీ చాలా డేరింగ్ అని భుజాలు తడుముకుంటున్నారేమో.. అలా చేసింది ఓ అమ్మాయి. ఇదంతా కూడా ముంబైలో చోటుచేసుకున్న వాస్తవం.

ముంబై మెట్రో సిటిలో కల్చర్ గన్, వైన్ తో ముడిపడి ఉంటుంది. అక్కడి యువత కుదిరతే మందుతో మత్తుగా చిత్తుచిత్తుగా చిందులేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయిలకు అయితే అడ్డుఅదుపు ఉండదు. తాజాగా పోలీస్ స్టేషన్ నే బార్ గా మార్చేసింది ఓ ఉత్తమురాలు. తీరిగ్గా మందు బాటిల్ ను పోలీసుల ముందు టేబుల్ మీద ఉంచి... ఓపిగ్గా బీర్ కొడుతూ.. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తనను మందు తాగుతున్నప్పుడు తీసుకువస్తారా అంటూ పోలీసుల మీద చిందులు వేసింది. మీ అంతు చూస్తానంటూ మండిపడింది. మొత్తంగా భారత్ లో అందునా ముంబైలో ఇలాంటి ఘటన జరగడం సర్వత్రా చర్చకు దారి తీసింది. భారతదేశంలో అమ్మాయిలు వెనుకబడ్డారు అని ధర్నాలు చేసే వాళ్లకు కాస్త ఇలాంటి వీడియో చూపిస్తే వాళ్ల అభిప్రాయమన్నా మార్చుకుంటారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  Police  Drunk Lady  Beer  Lady drunk in police station  Drink beer  

Other Articles