Chiranjeevi's Tagore Movie Hospital Incident Raised In Mahaboobnagar District Navodaya Hospital | Crime News | Hospitals Crimes

Chiranjeevi tagore movie hospital incident mahaboobnagar navodaya hospital

tagore movie updates, chiranjeevi tagore movie, tagore hospital incident, mahaboobnagar crime news, hospital crime incidents, navodaya hospital crime news, doctors treatment dead child

Chiranjeevi Tagore Movie Hospital Incident Mahaboobnagar Navodaya Hospital : Chiranjeevi's Tagore Movie Hospital Incident Raised In Mahaboobnagar District Navodaya Hospital. Doctors Treatment To A Dead Child.

అచ్చం ‘ఠాగూర్’ సినిమాలాగే వైద్యం చేసిన డాక్టర్లు

Posted: 10/01/2015 09:54 AM IST
Chiranjeevi tagore movie hospital incident mahaboobnagar navodaya hospital

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమా అందరికీ గుర్తుండే వుంటుంది. ముఖ్యంగా అందులో హాస్పిటల్ లో జరిగే సంఘటన ఆ సినిమాకే హైప్ తెచ్చింది. చనిపోయిన వ్యక్తికి చికిత్స చేస్తున్నామంటూ దొంగవైద్యం చేస్తూ డబ్బులు నొక్కేసే డాక్టర్ల బండారాన్ని చాలా క్లియర్ గా అందులో చూపించారు. అచ్చం అటువంటి సంఘటనే రియల్ లైఫ్ లోనూ వెలుగుచూసింది. అప్పటికే చనిపోయిన బాలుడికి తాము చికిత్స చేస్తున్నామంటూ వైద్యులు నమ్మబలికారు. అయితే.. మృతిచెందిన బాలుడి తండ్రి చాకచక్యంగా వ్యవహరించండంతో మొత్తం వ్యవహారం బెడిసికొట్టింది. దీంతో ఆ వైద్యులు తెల్లముఖం వేశారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ ఆసుపత్రిలో బుధవారం చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హన్వాడ మండలం రామన్నపల్లికి చెందిన ఆంజనేయులుకు హరిప్రసాద్(1) అనే కుమారుడు వున్నాడు. గతకొంతకాలం నుంచి తీవ్ర జ్వరం, మూర్ఛతో ఇబ్బంది పడుతున్న తన కుమారుడ్ని ఆంజనేయులు సెప్టెంబర్ 21వ తేదీన నవోదయ ఆసుపత్రిలో చేర్పించాడు. తొమ్మిది రోజుల నుంచి ఆ బాలుడికి చికిత్స చేస్తున్న వైద్యులు.. ‘మీ బాబు ఆరోగ్యంగా, క్షేమంగా ఉందని.. త్వరలో కోలుకుంటాడని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆస్పత్రి యాజమాన్యం ఫీజు రూపంలో రూ.92 వేలు వసూలు చేసింది. ఇక అక్కడి నుంచి వారి డ్రామా మొదలైంది. ఉదయం 11 గంటల సమయంలో బాబు చనిపోయాడని ఓసారి.. ఆ తర్వాత అత్యవసర చికిత్స చేస్తున్నామంటూ మూడు గంటలపాటు హైడ్రామా నడిపారు. దీంతో వారికి అనుమానం వచ్చింది. ‘కోలుకున్న బాబుకు వెంటిలేటర్‌పై చికిత్స చేయడం ఏమిటని బాలుడి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. అంతే! వెంటనే వారు వైద్యులను నిలదీయగా.. అప్పుడు అసలు బండారం బయటపడింది. బాబు చనిపోయాడంటూ ‘చావు’కబురు చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు.. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాలుడు చనిపోయాడని ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఇదిలావుండగా..  బాలుడు హరిప్రసాద్ మృతి చెందడం వెనుక వైద్యుల నిర్లక్ష్యం లేదని ఆ ఆసుపత్రి నిర్వాహకుడు చెప్పుకొచ్చాడు. ఆ బాలుడు 9 రోజుల నుంచి తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపిన ఆయన.. జ్వరం, మూర్ఛ ఒకేసారి రావడంతో పరిస్థితి విషమించిందని.. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడని తెలిపాడు. ఇందులో నవోదయ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం లేదని వాదిస్తూ వస్తున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles