Actress Samantha Parents Angry On IT Officials When They Raid On Their House | Vijay Puli Movie Updates | Kollywood News

Actress samantha parents angry on it officials

samantha ruth prabhu, samantha it raids, it raids on samantha house, samantha parents, samantha father joseph, samantha movies, samantha latest updates, samantha controversies, tamilnadu it raids, it raids on kollywood stars

Actress Samantha Parents Angry On IT Officials : Actress Samantha Parents Angry On IT Officials When They Raid On Their House.

ఐటీ అధికారులపై సమంత తల్లిదండ్రుల ‘పంజా’

Posted: 10/01/2015 10:09 AM IST
Actress samantha parents angry on it officials

ఆదాయపన్ను అధికారులు బుధవారం ఉదయం హఠాత్తుగా దక్షిణాది సినీపరిశ్రమకు చెందిన కొందరు స్టార్లు, ప్రముఖుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే! నటుడు విజయ్, నయనతార, ‘పులి’ సినిమా యూనిట్ కు చెందిన మొత్తం 25 మందితోపాటు బబ్లీ బ్యూటీ సమంత ఇళ్లలపై ఏకకాలంలో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలోనే సమంత తల్లిదండ్రుల ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా అవాక్కన సమంత పేరెంట్స్.. ఒక్కసారిగా ఐటీ అధికారులపై విరుచుకుపడ్డారు. అలాగే అక్కడికి కవరేజికి వెళ్లిన మీడియా ప్రతినిధిలుపైనా వారు చిందులు తొక్కారు.

చెన్నై పల్లవరం సారధి వీధిలోని అపార్టుమెంటులో సమంత నివసిస్తోంది. అదే అపార్టుమెంటు రెండో అంతస్తులో ఆమె తల్లిదండ్రులు వేరుగా కాపురం ఉంటున్నారు. బుధవారం ఉదయాన్నే ఐటీ అధికారులు తల్లిదండ్రుల ఇంటిలోకి ప్రవేశించారు. ఈ సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఐటీ అధికారులు సమంత, ఆమె తల్లిదండ్రుల ఇళ్లలో అనుమానం ఉన్న ప్రతి ప్రదేశంలో అణువణువు  సోదాలు జరిపారు. ఈ సందర్భంగా లభ్యమైన డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్న సందర్భంలో సమంత తండ్రి జోసఫ్ ప్రభు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సమంత తమ వద్ద డబ్బు, నగలు, డాక్యుమెంట్లు ఏమీ పెట్టదని, ఇంటికి అప్పుడప్పుడు వస్తుందని ఐటీ అధికారులతో వాదించారు. తాము అద్దె ఇంటిలో నివసిస్తున్నామని వారు ఐటీ అధికారులతో ఆవేశంగా మాట్లాడారు. హీరోయిన్ సమంత షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నారని ఐటీ అధికారులకు వారు తెలిపారు.

ఇదిలావుండగా.. చెన్నై, కొచ్చి, మధురై, హైదరాబాద్.. ఇలా అన్ని నగరాల్లో ఏకకాలంలో ఐటీ దాడులు జరిగాయి. దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వారిపై ఇలా హఠాత్తుగా సోదాలు నిర్వహించడంతో చిత్రపరిశ్రమలు నివ్వెరపోయాయి. అయితే సమంత, నయనతార ఇళ్లపై దాడులు నిర్వహించడం వెనకు అంతర్యమేమిటన్నది అదాయపన్ను శాఖ అధికారులు చెప్పడం లేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : samantha parents issues  it raids samantha house  kollywood updates  

Other Articles