అది రష్యాలోని మియాస్ నగరం. మిట్ట మధ్యాహ్నం. ఎర్రటి ఎండ కాస్తోంది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఎనిమిదవ అంతస్తు కిటీకీ కొద్దిగా తెరుచుకొని ఉంది. ఇంతలో అందులో నుంచి రెండేళ్ల బాలుడు మెల్లగా బయటకొచ్చి నిటారుగా కిటికీలో నిలబడ్డాడు. కొద్దిగా వొంగి రోడ్డుపై వెళుతున్న వాహనాలను చూస్తున్నాడు. దానికి గ్రిల్ లేదు. బాలుడి కాళ్ల కింద ఆసరాగా ఉన్న చెక్క కూడా బలంగా లేదు. ఈ దృశ్యాన్ని గమనించిన బాటసారులకు జరగబోయే దారుణాన్ని ఊహించి ముచ్చెమటలు పోశాయి. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.
ఈలోగా వంటగదిలో వున్నచిన్నారి తల్లి కంట తల్లి కూడా ఈ దృశ్యం పడింది. ఒక్క క్షణం పాటు అమె గుండె అగింది. తన చిన్నారికి ఏం జరుగుతుందోనన్న భయంతో నిశ్చేష్ఠురాలైంది. వెంటనే తేరుకుంది. తన చిన్నారిని ఎలా రక్షించుకోవాలన్న ఐడియా తోచింది. కంగారు పడకుండా ‘బాబు, బుజ్జీ, నాన్న! అన్నం తిందురా’ అంటూ లోపలికి పిలిచింది. ఆ రెండేళ్ల బాలుడు ఎలాగైతే బయటకొచ్చాడో, అలాగే లోపలికి వెళ్లాడు. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన బాటసారులు, ఇంతలో అక్కడికొచ్చిన పోలీసులు హమ్మయ్యా! అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు.
కిటికీలో నుంచి బయటకొచ్చి ప్రమాదం అంచున నిలబడినప్పుడు కూడా ఏ మాత్రం భయపడని ఆ బాలుడు లోపలికెళ్లాక తల్లి పెట్టిన సుమారు అరగంట పాటు వెక్కిళ్లు తీస్తూ ఏడవటం, అలా ఎందుకు చేశామని చీవాట్ల పెట్టడంతో మాత్రం చిన్నారిని గుక్కపట్టి అరగంట పాటు ఏడ్చాడు. అయితే స్థానిక మీడియాతో మాట్లాడిన బాలుడి తల్లి తన గుండె నోట్లోకి జారిపోయిందని, తన చిన్నారికి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పింది. తానే గాలి కోసం కిటికీని తెరిచానని, కానీ, చిన్నారి కిటికీ పైకి ఎక్కి ఇలా బయటకు వస్తాడని తాను ఊహించలేదని తెలిపింది. ఆ బాలుడి పేరేమిటో, తల్లి వివరాలేమిటో తెలియదుగానీ పిల్లవాడు కిటికీలో నుంచి బయటకు రావడాన్ని, మళ్లీ లోపలికి వెళ్లడాన్ని వీడియో తీసిన ఓ బాటసారి ఆన్‌లైన్‌లో దాన్ని పోస్ట్ చేశారు. వేలాది మంది ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more