మాజీ మంత్రి, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వంపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శలను సంధిస్తున్న అరుణపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడిందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు చౌరస్తాలో అరుణ తనదిగా చెప్పుకుంటున్న రూ.40 కోట్ల విలువ చేసే ఖాళీ స్థలాన్ని జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్-10 టౌన్‌ప్లానింగ్ అధికారులు పెట్రోల్‌బంక్‌ను ఆనుకొని ఉన్న 400 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.
భారీ పోలీసు బందోబస్తు మధ్య టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శేఖర్‌రెడ్డి నేతృత్వంలో కూల్చివేతలు సాగాయి. అరుణ సంబంధీకులు అడ్డుపడడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ స్థలం సొసైటీ లే అవుట్లో ఖాళీ స్థలంగా గుర్తించారు. సొసైటీకి గాని, భరత సింహారెడ్డికిగాని ఈ స్థలంతో ఎలాంటి సంబంధం లేదని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. కమిషనర్ సోమేష్‌కుమార్ ఆదేశించడంతో అధికారులు మూడు గంటల్లోనే ఆక్రమణలను తొలగించారు. కొంత కాలంగా భరత సింహారెడ్డి ఈ స్థలాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. కోర్టులో కేసు కూడా వేశారు. సొసైటీ కూడా ఈ స్థలం తమదేనంటూ పేర్కొంటుండడం గమనార్హం. అయితే ప్రభుత్వంపై విమర్శలు చేసే నాయకులు ఇకపై అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వం ఈ చర్యతో చాటిచెప్పిందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more