Modi cheated Ramjetmalani

Pm narendra modi cheated ramjetmalani

Modi, Ramjetmalani, India, Bihar, Elections, Black money

Pm Narendra Modi cheated Ramjetmalani. Ramjetmalani fired on pm Narendramodi. He said that modi fails to bring back black money to India.

పాపం.. మోదీ మోసం చేశాడు

Posted: 10/05/2015 08:16 AM IST
Pm narendra modi cheated ramjetmalani

భారత ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల్లో నిల్చున్నప్పుడు ప్రతి ఒక్కరు అతనికి అనుకూలంగా మాట్లాడిన వారే. మోదీ వస్తే మార్పు వస్తుందని అందరూ ఆశలు నింపుకున్నారు. అచ్చే దిన్ ఆనే వాలేహై.. మోదీ సర్కార్ ఆనే వాలేహై అంటూ ఒకటే ప్రచారం. ఆ దెబ్బకు నిజంగా కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చారు నరేంద్ర మోదీ. అయితే మోదీ వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఎలాంటి మార్పులు కనిపించడం లేదంటూ ప్రతిపక్షపార్టీల నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే ఏమీ చెయ్యకపోవడం కాదు బాబూ.. నన్ను ఏకంగా మోసం చేశాడు. కాబట్టి మీరు మాత్రం మోసపోకండి.. మోదీ పెద్ద మోసకారి అంటున్నారు ఓ లాయర్. తనకు జరిగిన అన్యాయం మీద మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు. మోదీ ఇంతలా ఎవరిని మోసం చేశారో తెలుసా..?

బిజెపి పార్టీలో కురువృద్దుల్లో రామ్ జఠ్మలానీ ఒకరు. దేశంలోనే ఎంతో పేరున్న క్రిమినల్ లాయర్ గా అందరికి తెలుసు. సొంత పార్టీ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు జఠ్మలానీ. అయితే తాజాగా నరేంద్ర మోదీని టార్గెట్ గా చేసి మాట్లాడుతున్నారు. బీహార్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లాయర్ గారి మాటలు ప్రాధాన్యతను సంపాదించాయి. బీహార్ ఎన్నికల్లో మోదీ మాటలకు మోసపోవద్దని బీహార్ ఓటర్లకు హితవుపలుకుతున్నారు రాంజెఠ్మలానీ. విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తిరిగి దేశానికి తెప్పిస్తానని చెప్పారని. కానీ ఆచరణలో మాత్రం అది జరగడం లేదని. దేశ ప్రజలను మోదీ మోసం చేస్తున్నారని అన్నారు. మోదీని దైవదూతగా అనుకున్నానని కానీ తనను మోసం చేశాడని రాంజెఠ్మలానీ మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Ramjetmalani  India  Bihar  Elections  Black money  

Other Articles