కేసీఆర్ అంటే కేరాఫ్ మాటలు కేరాఫ్ పంచులు కేరాఫ్ వెటకారం ఇంకేమైనా ఉంటే అవి కూడా కేసీఆర్ కు బాగా సూటవుతాయి. గాల్లో మాటలు చెప్పడం.. చేతల్లో మాత్రం చుక్కలు చూపించడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగా అలవాటు. మాటలతో కాలం వెల్లదియ్యడంలో కేసీఆర్ ను మించిన వారు ఎవరూ ఉండరేమో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అలా చేస్తాం.. ఇలా చేస్తాం అంటూ అరచేతిలో ఆకాశంలోని చుక్కలు చూపించారు తెలంగాణ ముఖ్యమంత్రి. సెక్రటేరియట్ ను అలా చేస్తాం.. హైదరాబాద్ ను ఇలా చే్స్తామంటూ రోజుకో బ్లూప్రింట్ తియ్యడం దాని మీడియా ముందు గొప్పగా చెప్పడం తర్వాత దాన్ని అటకెక్కించడం శరామామూలైపోయింది.
తాజాగా కేసీఆర్ నర్సన్న పేట గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అక్కడికి వెళ్లి రైతులతో, గ్రామస్తులతో గ్రామ సభను ఏర్పాటు చేశారు. వారికి ప్రభుత్వం తరఫున అందించే సహాకారం, వర్తించే పథకాలు ఇలా అన్నింటి మీదా ఓ డెమో నిర్వహించారు. అసలే కేసీఆర్ సారు.. అందునా గ్రామాన్ని దత్తత తీసుకుంటే ఎలా ఉంటుంది. అందుకే చిగురించిన ఆశలతొ కేసీఆర్ చెప్పినదానికల్లా ఊ కొట్టారు గ్రామస్తులు. అయితే గతంలో చెప్పిన మాటల్లాగా కాకుండా కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాన్ని దత్తత తీసుకున్నారని.. ఖచ్చితంగా రానున్న నాలుగైదు నెలల్లో గ్రామ రూపురేఖలు మారతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కనీసం ఈ సారికైనా మాటలు కట్టిపెట్టి మేలు చేస్తారా అన్నది చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more