కడుపు కోసం కోటి విద్యలు అని అందరికి తెలుసు. అందుకే కడుపు నింపుకోవడానికి రకరకాల జాబులు. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే నోట్ల కట్టలు వర్షంలా కురిస్తే ఎలా ఉంటుంది.. వంద, ఐదు వందలు, వెయ్యి నోట్లు వర్షంలా కురిస్తే ఎలా ఉంటుంది. అవును డబ్బులు ఎక్కువైతే అలానే ఉంటుంది. గుజరాత్ లో పటిదార్ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. సామాజిక ఉన్నత వర్గాలు ఆర్థికంగా వెనుకబడటం హార్దిక్ పాటిల్ ఉద్యమానికి ఊపుతీసుకువచ్చింది. అయితే తాజాగా హార్దిక్ పాటిల్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఏకంగా నోట్ల వర్షం కురిపించిన పటేల్ అభిమానులు. తమ నోటు అభిమానాన్ని చాటుకున్నారు.
హార్దిక్ పాటిల్ గత కొంత కాలంగా పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా గుజరాత్ తో సహా చాలా ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. అయితే కేవలం 22 ఏళ్ల హార్దిక్ పాటిల్ ఉద్యమం మొత్తం నోట్ల మీదే నడుస్తోంది అన్న వార్తలకు మరింత బలం చేకూరేలా తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. ఓ కార్యక్రమంలొ పాల్గొనడానికి వచ్చిన హార్దిక్ పాటిల్ మీద వంద, ఐదు వందలు, వెయ్య రూపాయల నోట్లను కుమ్మరించడం.. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ వీడియో మీద పటేల్ వర్గానికి చెందిన వారు కూడా వెనకేసుకొస్తున్నారు. పెద్ద పెద్ద ఫంక్షన్ లలో ఇలా జరగడం మామూలే అని వారంటున్నారు. అయితే డబ్బులు ఎక్కువైతే పేదలకు పంచడమో లేదంటే వేరే ఏదో చెయ్యడమే చెయ్యాలి కానీ ఇలా చేస్తారా అంటే ఆశ్చర్యపోయే వాళ్లు ఆశ్చర్యపొతూనే ఉన్నారు. ఆకలి అరుపులకు. అరగని తేన్పులకు తేడా లేదంటే ఎలా మరి...!
*Abhinavachary*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more