AP capital city area villagers decided to build a temple for Narachandrababu Naidu.

Temple for chandrababu naidu

Chandrababu Naidu, Amaravati, Capital city, Temple, Babu temple, Chandrababu Naidu statue, Thullur, Capital Region

In Thullur village, the farmers decided to build a temple and establish the statue of chandrababu Naidu as god. After the announcement of Capital city, thullur land rates hike.

ITEMVIDEOS: గుడి... గుడిలో దేవుడు చంద్రబాబే

Posted: 10/05/2015 04:26 PM IST
Temple for chandrababu naidu

అభిమానం హద్దులు దాటితే ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. అయితే అమరావతి పుణ్యమా అని ఏపి సిఎం నారాచంద్రబాబు నాయుడు పరిస్థితి బూరల బుట్టలో పడ్డ చందంగా మారింది. చంద్రబాబు నాయుడును కొంత మంది వెంకటేశ్వర స్వామి అనుకుంటే మరికొందరు సాయిబాబాగా. మరి కొంత మంది శివుడిగా ఇలా రకరకాలుగా కొలుచుకుంటున్నారు. ఏపి రాజధాని గ్రామంలొ మారిన పరిస్థితి.. అక్కడ చంద్రబాబు నాయుడును ఏకంగా దేవుడినే చేశాయి. ఏపీ రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుడు రూపంలో ఉన్న ఫెక్సీలు హల్‌చల్‌ చేస్తున్నాయి. తమ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించడంతో కొంతమంది రైతులు తమ అభిమానాన్నిచాటుకుంటున్నారు. బాబును అవతారమూర్తిగా భావిస్తూ.. వివిధ రూపాల్లో ఫెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఆయన పేరుమీద గుడిని కూడా కట్టబోతున్నారు. తమ ఊరును రాజధాని చేశారని బాబును దేవుళ్ల అవతారాల్లో ముంచెత్తారు ఆయన అభిమానులు.

రాజధానిగా తుళ్లూరు ప్రాంతాన్ని ప్రకటించి అక్కడ భూములకు భూమ్‌ తీసుకొచ్చారు చంద్రబాబు. దీంతో ఎకరం 10 లక్షల విలువ కూడా లేని భూమి ఒక్కసారిగి రెండు కోట్లకు చేరింది. దీంతో ఆ ప్రాంతంలో రైతులు ఉన్న పొలంలో సగం రాజధానికి ఇచ్చి, సగం భూములను అమ్ముకున్నారు. అలా రాజధాని రూపంలో తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన చంద్రబాబును ఇలా దేవుడిగా కొలుచుకుంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

తుళ్లూరులోని టీడీపీ నాయకులు, రైతులు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి చంద్రబాబుకు గుడి నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని భూ సమీకరణలో లేని గ్రామం హరిశ్చంద్ర పురంలో కృష్ణానది ఒడ్డున చంద్రబాబు గుడిని కట్టబోతున్నారు. దీనికి సంబందించి స్థలాన్ని కూడా పరిశీలించారు. తుళ్లూరు మండలంలో ఉన్న ఈ గ్రామంలో గుడి కడితే, రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో హరిశ్చంద్రపురంలో గుడి కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలో ఇప్పటికి 8 దేవాలయాలు ఉన్నాయని, చంద్రబాబు గుడి కట్టి 9 దేవాలయాల్లోనూ పూజలు నిర్వహిస్తామని గుడి నిర్మాణం చేయబోతున్న గ్రామస్తులు చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గుడి పూర్తవుతుందో లేదంటే మధ్యలోనే వదిలేస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles