Obama Apologizes for Hospital Attack

Obama apologizes

America, Obama Apologizes, Obama, barack Obama, Afghanistan, Hospital, Obama apologizes for bombing

President Barack Obama personally apologized Wednesday to the head of Doctors Without Borders for what he described as the mistaken bombing of its field hospital in Kunduz, Afghanistan, promising a full investigation into the episode, which took the lives of nearly two dozen doctors and patients.

తప్పైంది... క్షమించండి అంటున్న ఒబామా

Posted: 10/08/2015 11:35 AM IST
Obama apologizes

అవును అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బేషరతుగా క్షమాపణలు కోరారు. అనుకోకుండా తప్పు జరిగిపోయింది క్షమించండి.. జరిగిన దానికి తీవ్రంగా చింతిస్తున్నాం.. వారికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా అంటూ ఒబామా ప్రకటన వెల్లడించారు. అయితే డాక్టర్స్ విత్ నో బోర్డర్స్ అనే సంస్థ మాత్రం మొత్తం ఘటన మీద ఎంక్వైరీ కోరుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటీ అంటే ఆప్ఘనిస్తాన్ లో ఓ ఆస్పత్రి మీద అమెరికా దళాలు బాంబ్ దాడి చేయగా అందులో 19 మంది మృతి చెందారు. అందులో 14 మంది ఆస్పత్రి బృందంతో పాటు పేషంట్లు కూడా ఉన్నారు. అయితే ఘటన జరిగిన ఐదురోజుల తర్వాత ఒబామా ఇలా క్షమాపణలు కోరడం మీద కూడా కొంత మంది పెదవి విరుస్తున్నారు.

యుఎస్ కు చెంది ఎ.సి-130 అనే గన్ షిప్ ఆప్ఘనిస్తాన్ లోని కుండుజ్  అనే ప్రాంతంలో ఉన్న ఓ ఆస్పత్రి మీద బాంబులతో దాడి చేసింది. దాంతో ఆస్పత్రికి చెందిన 14 మంది, మరో ఐదుగురు పేషంట్లు మృతి చెందారు. అయితే జరిగిన పొరాపాటుకు ఒబామా క్షమాపణలు కోరారు. గతంలో కూడా ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అమిత్ ఖర్జాయ్ కు క్షమాపణలు చెప్పారు. గతంలో ఆప్ఘన్ లో ఉన్న నాటో దళాలు ఖురాన్ ప్రతులను దహనం చెయ్యడం మీద ఒబామా క్షమాపణలు కోరారు. అయితే తాజాగా ఆస్పత్రి మీద జరిగిన దాడి మీద ఒబామా క్షమాపణలు మీద వ్యతిరేకత వస్తోంది. అమెరికా ఆధిపత్య ధోరణితో దాడులు చెయ్యడం తర్వాత ప్రాణనష్టం జరిగిన తర్వాత క్షమాపణలు కోరడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  Obama Apologizes  Obama  barack Obama  Afghanistan  Hospital  Obama apologizes for bombing  

Other Articles