చెట్టులెక్క గలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా.. చెట్టులెక్కి చిటారు కొమ్మ చిగురు తేగలవా అని చిన్నప్పుడు సినిమాలో వచ్చిన పాట ఒకటి ఉంది. అయితే చెట్లెక్కే వాళ్లు చాలా మందే ఉన్నారు కానీ ఓ బ్రిడ్జ్ ఎక్కాలంటే మాత్రం చాలా మంది భయపడుతున్నారు. ఎందుకు అలా అంటే... అది ఎక్కాలంటే దైర్యం కావాలి. సరే చూద్దాం అనుకొని సాహసం చేసినా కొద్ది దూరం కూడా నడవకముందే ప్రాణాలు గాల్లో తేలడంతో వెనక్కి తిరిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇంతకీ అలాంటి బ్రిడ్జి ఎక్కడ ఉంది అనుకుంటున్నారా...? చైనాలో కొత్తగా ఏర్పాటు చేశారు. చైనాలోని యుంటై మౌంటేన్ వద్ద ఈ బ్రిడ్జిని ఏర్సాటు చేశారు. ఎంతో మంది దీన్ని చూడడానికి వస్తున్నారు. కానీ చాలా మంది దాటకుండానే వెనక్కి తగ్గుతున్నారు. ఎందుకు అంతలా భయపడుతున్నారో తెలుసా..?
చైనాలోని యుంటై మౌంటేన్ వద్ద టూరిస్ట్ ల కోసం కొత్తగా ఎంతో ఖర్చుతో ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ ఉంది. దాని స్పెషాలిటి ఏంటీ అనుకుంటున్నారా.? బ్రిడ్జిని గాజుతో తయారు చేశారు. అవును జనరల్ గా బ్రిడ్జ్ అంటే కాంక్రీట్ తో కడతారు.. కానీ అక్కడక్కడ అడవుల్లో అయితే కట్టెలతో బ్రిడ్జ్ లు ఏర్పాటు చేస్తారు కానీ అక్కడ మాత్రం గ్లాస్ తో బ్రిడ్జ్ ను ఏర్పాటు చేశారు. అది కూడా మామూలు ఎత్తులో కాదు భూమి నుండి 3500 ఫీట్ల ఎత్తులో కాలి కింద గాజు ఉంటే. కింద ఉండే లోయ కనిపిస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి. అచ్చంగా అలాంటి అనుభూతినే చైనాలో ఈ బ్రిడ్జ్ కల్పిస్తుంది. చాలా మంది టూరిస్ట్ లు ఈ బ్రిడ్జ్ ను దాటేందుకు ప్రయత్నించినా కొద్ది దూరం రాగానే దైర్యం సరిపోక వెనుదిరుగుతున్నారు. అయితే తాజాగా బ్రిడ్జ్ మొత్తం గ్లాస్ తో ఉండగా.. అక్కడక్కడా గ్లాస్ లో చిలికలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. చాలా మంది పర్యాటకులు ఆ చీలకలు చూసి భయపడుతున్నారు. అధికారులు మాత్రం అవి ఏమీ కాదని అంటున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more