Kejriwal challenges BJP, sacks Delhi Food Minister Asim Ahmed on corruption charges

Kejriwal sacks food minister for corruption

asim ahmed khan, arvind kejriwal, asim khan, kejriwal asim corruption, delhi food minister, aap minister, aap corruption charges, aap minister sacked, asim ahmed corruption, aap minister corruption, aap food minister sacked, aap news, delhi news

Delhi Chief Minister and AAP convenor Arvind Kejriwal said, "We've received a serious complaint of corruption against our Cabinet Minister Asim Ahmed and the complainant has sent us a 1-hour audio clip."

ప్రధాని మోడీకి సవాల్ విసిరిన కేజ్రీవాల్.. అవినీతి మంత్రికి ఉద్వాసన

Posted: 10/09/2015 06:02 PM IST
Kejriwal sacks food minister for corruption

అప్ అధినేత, ధేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి మరో సవాల్ విసిరారు. తన మంత్రివర్గంలో ఆహార శాఖ మంత్రిగా కోనసాగుతూ.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసిం అహ్మద్ ఖాన్‌ను పదవి నుంచి బర్తరఫ్ చేశారు. అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో అహ్మద్ ఖాన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారు ప్రకటించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. అహ్మద్ ఖాన్‌పై తమకు అందిన ఫిర్యాదును సీబీఐకి బదిలీ చేస్తామని చెప్పారు.

అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అందరిపైనా సర్కార్ దృష్టి ఉందని, అధికారులు కావొచ్చు, మంత్రులు కావొచ్చు, ఎమ్మెల్యేలు కావొచ్చు ఎవరైనా అవినీతి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, అహ్మద్ ఖాన్ స్థానంలో నూతన ఆహార శాఖ మంత్రిగా ఇమ్రాన్ హుస్సేన్‌ను నియమించారు. ఈ చర్యతో పరోక్షంగా ఆయన ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వానికి సవాల్ విసిరారని ఢిల్లీ సహా పలు జాతీయ దినపత్రికలు కథనాలను ప్రచురించాయి. తమ పాలన అవినీతి లేకుండా చేస్తామని ఎన్నికలు ముందు ప్రచారం చేసుకున్న బీజేపి.. ఆ తరువాత ప్రధాని విదేశాలకు వెళ్లిన సందర్భాలలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారని పేర్కోన్నాయి.

అయితే లలిత్ గేట్ వ్యవహరాంలో ఐఫీఎల్ వ్యవస్థాపక అధ్యక్షుడు లలిత్ మోడీకి సహకరించారని అరోపణలు ఎదుర్కోంటున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజేలపై బీజేపి తీసుకున్న చర్యలేమిటని మోడీ ప్రభుత్వాన్ని.. బీజేపి పార్టీని అరవింద్ కేజ్రీవాల్ పరోక్షంగా ప్రకటించినట్లు వుందని కథనాల సారాంశం. ఇక మధ్యప్రదేశ్ లో వ్యాపమ్ కుంభకోణంతో పాటు ఈ కుంభకోణంలో నిందితులు, సాక్షులు సహా మీడియా ప్రతినిధి అకస్మిక మరణానికి కారణమైన విషయంలో కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ పై అరోఫణలు వెల్లివిసిరినా.. కేంద్రం ఏం చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తోందని అప్ చర్యలు పరోక్షంగా ప్రశ్నిస్తున్నాయని మీడియా కథనాలు ప్రచురించాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asim ahmed khan  delhi food minister  arvind kejriwal  

Other Articles