Geeta arrives in Delhi, 'Welcome home our daughter', tweets Sushma Swaraj

Geeta returns from pakistan will be reunited with family after dna test

geeta india pakistan, geeta indian girl lost in pakistan, geeta indian in pakistan, geeta return india, geeta indian girl, geeta in pakisatan, geeta stranded in pakistan, edhi foundation, nation news, india news, latest news

Geeta, a deaf-mute Indian woman who has been stranded in Pakistan for over a decade, arrives in India and reaches Ministry of External Affairs office.

ITEMVIDEOS: ఉద్విగ్న క్షణం.. వీడిన గీత అజ్ఞాత వాసం.. కన్నవారి కంట ఆనందబాష్పాలు

Posted: 10/26/2015 01:04 PM IST
Geeta returns from pakistan will be reunited with family after dna test

అది పాకిస్థాన్ లోని లాహార్ రైల్వే స్టేషన్లలో సంజౌతా ఎక్స్ ప్రెస్ రైళ్లో ఒంటరిగా కూర్చుని ఓ ఏడు ఎనమిదేళ్ల చిన్నారిని అక్కున చేర్చుకున్నారు పాకిస్థాన్ రేంజర్లు. అయితే ఏం అడిగినా చెప్పడానికి, కనీసం వినడానికి కూడా అవకాశంలేని బాలిక పరిస్థితిని గమనించిన రేంజర్లు అమెను అక్కున చేర్చుకున్నారు. అలా దశాబ్దమున్నర కాలం గడిచింది. పాకిస్థాన్లోని గీత తమ బాలికేనంటూ భారత్ లో అమె తల్లిదండ్రులు గుర్తించారు. వారిని గీత కూడా గుర్తు పట్టింది. 15 ఏల్లు అమె చేస్తున్న అజ్ఞాతవాసం వీడింది. ఇవాళ గీత స్వదేశానికి చేరుకుంది. కరాచీ నుంచి విమానంలో ఢిల్లీ చేరుకున్న గీతకు భారత విదేశాంగ శాఖ అధికారులు స్వాగతం పలికారు. ఇన్నేళ్ల తరువాత గీతను చూసిన కుటుంబసభ్యులు ఉద్వేగభరితులయ్యారు.

 

కరాచీ నుంచి ప్రత్యేక విమానంలో ఈదీ ఫౌండేషన్ సభ్యులు గీతను భారత్‌కు తీసుకువచ్చారు. గీతను తీసుకువెళ్లేందుకు ఆమె కుటుంబసభ్యులుగా చెప్పుకుంటున్న జనార్దన్‌మహతో, ఆయన ఇద్దరు కుమారులు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం గీతను అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. 15 ఏళ్ల క్రితం పంజాబ్‌లోని జలంధర్‌లో తప్పిపోయి లాహోర్‌ వెళ్లింది. మూగ, బధిర బాలిక అయిన గీతను ఈదీ ఫౌండేషన్‌ సభ్యులు చేరదీశారు. గీత స్వరాష్ట్రం బీహార్‌. ఇన్నాళ్లూ ఆమెను పెంచి పోషించిన ఈదీఫౌండేషన్ కార్యకర్తలకు గీత వీడ్కోలు పలికే సమయంలో ఉద్వేగకరమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  India  Edhi Foundation  Geeta  Karachi  Bihar  Deaf-mute girl  

Other Articles