బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మెజారిటీ సాధించి అధికారం సొంతం చేసుకుంటుందని తన ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైనట్లు ఆంగ్ల వార్తా చానల్ ఎన్డీటీవీ ప్రకటించింది. అక్టోబర్ 12న మొదలై నవంబర్ 5 వరకూ ఐదు దశలుగా సాగిన ఎన్నికలపై నిర్వహించిన ఫలితాలను ఎన్డీటీవీ శుక్రవారం ప్రసారం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో విపక్ష ఎన్డీఏ 125 సీట్లు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీయూ సారథ్యంలోని ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహాకూటమి 110 సీట్లు సాధించి విపక్షంలోకి వెళుతుందని పేర్కొంది.
ఐదు దశల ఎన్నికల్లో తొలి దశ, చివరి దశ ఎన్నికలు జరిగిన సీట్లలోనే మహాకూటమికి.. ఎన్డీఏ కన్నా స్వల్పంగా ఎక్కువ సీట్లు వస్తాయని.. మధ్యలో గల మూడు దశల్లోనూ ఎన్డీఏకే అధిక సీట్లు వస్తాయని తేలినట్లు వివరించింది. అయితే.. గురువారం జరిగిన తుది దశ ఎన్నికల్లోనే రెండు కూటముల తల రాతలు మారిపోయినట్లు పేర్కొంది. ముస్లింలు, ఓబీసీలు అధికంగా గల సీమాంచల్, మిథిలాంచల్ ప్రాంతాల్లో మొదటి నాలుగు దశలకన్నా అధికంగా రికార్డు స్థాయిలో 60 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే.
ఈ ఐదో దశలో ఎన్నికలు జరిగిన 57 స్థానాల్లో మహాకూటమి తన సిట్టింగ్ స్థానాలను 17 కోల్పోతే.. ఎన్డీఏ 20 స్థానాలను అధికంగా గెలుచుకోనుందని ఎన్డీటీవీ వివరించింది. మొత్తం మీద.. మహాకూటమి కన్నా 15 సీట్లు అధికంగా సాధించి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. రాష్ట్రంలోని 243 నియోజకవర్గాల నుంచి 76,000 మందిని సర్వే చేసి ఈ ఫలితాలను క్రోడీకరించినట్లు తెలిపింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more