Anupam Kher Leads March Against Intolerance

Anupam kher leads march against intolerance

Anupam Kher, Anupam Kher march, Anupam Kher in Delhi, Anupam Kher on Intolerance, Anupam Kher Rally on Intolerance

Actor Anupam Kher is leading a march to the Rashtrapati Bhavan today in New Delhi to protest against the voices being raised over "intolerance" in the country.The actor claims that the intolerance debate is an attempt to malign the image of the country and is intended to target the Narendra Modi-led government at the Centre.

ఆ అర్హత ఎవరికీ లేదన్న అనుపమ్ ఖేర్

Posted: 11/07/2015 01:06 PM IST
Anupam kher leads march against intolerance

అవార్డ్ వాపసీ కి వ్యతిరేకంగా బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ దిల్లీలో ర్యాలీ నిర్వహించారు. దేశంలో అసహనం నెలకొందని చాలా మంది మేధావులు తమ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ.. అనుపమ్ ఖేర్ ఈ ఉదయం దిల్లీ వేదికగా ర్యాలీ నిర్వహించారు. కాగా దేశంలో అవార్డు వాపసీ మీద, అసహనం మీద అసలు నిజాలు అంటూ బిజెపి ఓ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించింది. కాగా తాజాగా అనుపమ్ ఖేర్ ర్యాలీ బాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది.

anupam-kher-twitter-comment

మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక దేశంలో అసహనం పెరిగిందని వస్తున్న వార్తలను అనుపమ్ ఖేర్ వ్యతిరేకించారు. అసలు దేశంలో అసహనం పెరిగింది అని అనడానికి ఎవరికీ అర్హత లేదని అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. భారతదేశం అంటేనే సహనపూరిత దేశం అని అన్నారు. కొంత మంది వ్యక్తులు కావాలని పనిగట్టుకొని.. దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. నకిలీ లౌకికవాదం మీద తమకు నమ్మకం లేదని. తాము అసలు సిసలు లౌకికవాదులమని.. అలాగే సిసలు దేశభక్తులమని కూడా అనుపమ్ ఖేర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ర్యాలీలో చాలా మంది రచయితలు, యాక్టర్లు, పెయింటర్లు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles