PM Modi Announces Rs. 80000 Crore Package

Pm modi announces rs 80000 crore package

PM Modi Srinagar rally, PM Modi in J&K, PM Modi Kashmiriyat, modi, Modi to Kashmir, Jammu Kashmir

Announcing a Rs. 80,000 crore package for Jammu and Kashmir, Prime Minister Narendra Modi today said he wanted it to be used to change the future of the youth of the state and to build a modern Kashmir. Addressing a public rally at the Sher-i-Kashmir cricket stadium in Srinagar, he spoke about "dreams of a new powerful and resurgent Kashmir" and added that the package was "just the beginning."

కాశ్మీర్ కు 80వేల కోట్ల ప్యాకేజీ

Posted: 11/07/2015 03:13 PM IST
Pm modi announces rs 80000 crore package

జమ్ము కాశ్మీర్ కు ప్రధాని మోదీ బంపరాఫర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరఫున 80 వేల కోట్ల రూపాయలు ప్యాకేజీ కింద ప్రకటించారు. జమ్ము కాశ్మీర్ యువత అన్ని రకాలుగా ముందుకు దూసుకువెళ్లాలని ఆకాంక్షించారు. గతంలో బీహార్ ఎలక్షన్ లకు ముందు లక్ష పాతిక కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించారు. అయితే తాజాగా మరోసారి ప్యాకేజీ బాట పట్టారు మోదీ. అయితే గత ఎన్నికల్లో బాగంగా కాశ్మీర్ మీద పూర్తి స్థాయి దృష్టిసారించారు మోదీ. జమ్ము కాశ్మీర్ యువతకు ఉపాది అవకాశాలను కల్పించడం తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని మోదీ వివరించారు. అలాగే ఈ ప్యాకేజీ కేవలం ప్రారంభం మాత్రమే అని అన్నారు. ముందు ముందు కాశ్మీరీల కోసం ఎన్డీయే సర్కార్ మరిన్ని కార్యక్రమాలతో, పథకాలతో ముందుకు వస్తుందని వివరించారు.

ఒకటి కాదు రెండు కాదు ఎనభై వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన మోదీ.. జమ్ము కాశ్మీర్ పట్ల తమ నాయకుడు అటల్ బీహారీ వాజ్ పేయ్ నడిచిన బాటలోనే నడుస్తామని ప్రకటించారు. కాశ్మీరీల గురించి వాజ్ పేయ్ తీసుకున్నట్లుగానే తాము కూడా పూర్తి బాధ్యత తీసుకుంటామని అన్నారు. గతంలో లాగా కాశ్మీర్ మళ్లీ బెస్ట్ టూరింగ్ ప్లేస్ లోకి రావాలని ఆకాంక్షించారు. తనకు జమ్ము కాశ్మీర్ మీద ఎవరి రిపోర్ట అక్కర్లేదని అన్నారు. జమ్ము కాశ్మీర్ ను అభివృద్ది పధాన నడిపించేందుకు ఈ ప్యాకేజీ ఎంతో పనికివస్తుందని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles