రాష్ట్రవ్యప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో ఓ ‘సీక్రెట్’ కోణం వెలుగు చూసింది. ఈ కేసులో మాజీ ఎంపీ రాజయ్య, మాధవితోపాటు సారిక భర్త అనిల్, అతని రెండో భార్య సనను నాలుగో నిందితులుగా పేర్కొన్న పోలీసులు.. ఆమె నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. శనివారం రాత్రి ఖమ్మం జిల్లాలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రెండు రోజులుగా కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) క్యాంపులో సనను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అనిల్‌తో జీవనం తన వల్ల కాదని, తనకు న్యాయం చేయాలంటూ కొన్ని నెలల క్రితమే రాజయ్య వద్దకు సన పంచాయతీ తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య రూ.10 లక్షలు చెల్లించాలని ఒప్పందం జరిగినట్లు విచారణలో సన తెలిపినట్లు సమాచారం. అయితే.. ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసమే సన ఈ కొత్త నాటకాన్ని తెరమీదకి తీసుకొచ్చిందని ఆరోపణలు వస్తున్నాయి.
ఇదిలావుండగా.. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మరణాలపై ఇప్పటికీ అనుమానాలు వీడటం లేదు. సంఘటన జరిగిన రోజు రాత్రి వాస్తవంగా ఏం జరిగిందనే అంశం ఇంకా మిస్టరీగానే ఉంది. దుర్ఘటనకు ఆస్తి వివాదాలు ఏమైనా కారణమయ్యాయా అనేది తేలాల్సి ఉంది. వంటగ్యాస్ లీకై మంటలు చెలరేగిన తీరుపై స్పష్టత రాలేదు. అదేవిధంగా.. సంఘటనకు ముందు రోజు రాత్రి ఆహారంలో మత్తు పదార్థాలు ఏమైనా కలిపారా అనే అనుమాలు సైతం వ్యక్తమయ్యాయి. దర్యాప్తులో కీలకమైన ఫోరెన్సిక్ నివేదికలో ఏం తేలనుందనే అంశం చర్చనీయూంశంగా మారింది. సారిక, ముగ్గురు పిల్లల మరణం కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న సనను రెండు రోజులుగా రహస్యంగా విచారిస్తున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు అనిల్, రాజయ్య, మాధవిల విచారణపై దృష్టి సారించాల్సి ఉంది. వీరిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ఇప్పటి వరకు కోర్టులో పిటిషన్ వేయలేదు. వీరిపై వరకట్న వేధింపులు(498-ఎ), ఆత్మహత్యకు ప్రోత్సహించడం(306) సెక్షన్ కింద కేసు నమోదైంది. మరోవైపు.. ఎన్నో ట్విస్టుల మధ్య కొనసాగుతున్న ఈ కేసులో మరెన్ని కొత్త కోణాలు వెలుగుచూస్తాయోనని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more