He is the only person to help BJP and Modi

One person can help modi and bjp

Subramanian Swamy, Modi, BJP, Subramanian Swamy tweets, Subramanian Swamy on Modi, Subramanian Swamy on Bihar, Subramanian Swamy News

BJP senior Leader Subramanian Swamy said that there is only person can help the BJP and Modi at this situation. After BJP defeat in Bihar elections Subramanian Swamy comments took place in news.

బిజెపిని, మోదీని కాపాడే వ్యక్తి అతడే

Posted: 11/10/2015 11:14 AM IST
One person can help modi and bjp

బలం తక్కువైతే పాము కూడా బల్లై కరుస్తుందని అంటుంటారు. అచ్చం అలానే ఉంది బిజెపి పార్టీ పరిస్థితి. బిజెపి పార్టీ బీహార్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ మీద, ప్రదాని నరేంద్ర మోదీ మీద విమర్శల వర్షం కురుస్తోంది. మోదీకి బీహారీలు సరైన సమాదానం చెప్పారంటూ మోదీని దుమ్మెత్తిపోస్తుండగా.. కొంత మంది మాత్రం ఇప్పటికైనా ఇళ్లు చక్కదిద్దుకోవాలని సూచిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పరిస్థితిని సమీక్షించాలని సూచిస్తున్నారు. అయితే ఓ సీనియర్ నాయకుడు మాత్రం మోదీని కాపాడేది ఒకే ఒక వ్యక్తి అని.. అతడు మోదీని, బిజెపి పార్టీని కూడా కాపాడగలరు అని అంటున్నారు. గతంలో కూడా అదే జరిగిందని అంటున్నారు.

Also Read: నితీష్ ను కలిసిన శత్రుజ్ఞ సిన్హా

బీహార్ ఎన్నికల్లో బిజెపి పార్టీ ఓటమిపాలైంది. మహా కూటమి దెబ్బకు కమలదళం నిలవలేక.. వాడిపోయింది. అయితే బిజెపి పార్టీని కాపాడే ఒకే ఒక వ్యక్తి రాముడే అంటూ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు. 1977లో లోక్‌సభలో 330 స్థానాలున్న జనతా పార్టీ, ఆ తర్వాత జరిగిన 1980 ఎన్నికల్లో 31 స్థానాలకు పడిపోయిందని, దాంతో అప్పటి నుంచి బీజేపీ విడిపోయి తర్వాత గాంధీవాదం, సామ్యవాదాలను చేపట్టిందని సుబ్రమణ్యం స్వామి గుర్తు చేశారు. దాంతో 1984లో జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలకు పడిపోయిందన్నారు. ఆ తర్వాత రాముడు వచ్చి బీజేపీని రక్షించాడని ఆయన వ్యాఖ్యానించారు. మరి చూడాలి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యల మీద బిజెపి పార్టీ ఎలా స్పందిస్తుందో.. ఇప్పటికే శత్రుజ్ఞ సిన్హా పార్టీకి కొరకరాని కొయ్యగా మారగా సుబ్రహ్మణ్య స్వామి మాటలు మరింత నష్టపరుస్తున్నాయి.

Also Read: మోదీకి, బిజెపికి తలంటిన పాక్ మీడియా

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subramanian Swamy  Modi  BJP  Bihar  

Other Articles