beautician nandini chowdary had also supply male escorts to hifi females and charged huge money | beautician cheating case

Beautician nandini chowdary cheating male escort case police investigation

beautician nandini chowdary news, beautician nandini chowdary cheating case, nandini chowdary fraud cases, nandini chowdary male escorts, nandini chowdary controversial news, nandini chowdary money cheating case

beautician nandini chowdary cheating male escort case police investigation : In the police investigation another twist came in nandini chowdary cheating case that she had also supply male escorts to hifi females and collected huge money.

ఆ ‘బ్యూటీషియన్’.. మేల్ ఎస్కార్ట్స్ సరఫరా కూడా చేసేదట!

Posted: 11/17/2015 10:27 AM IST
Beautician nandini chowdary cheating male escort case police investigation

హైదరాబాద్ లో ఇటీవల చీటింగ్ కేసులో పట్టుబడిన బ్యూటీషియన్, బ్లష్ స్పా అండ్ లగ్జరీ సెలూన్ నిర్వాహకురాలు యలమంచిలి నందిని చౌదరి వ్యవహారంలో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఇప్పటికే ఆభరణాల పేరుతో ఓ వ్యాపారిని దాదాపు రూ.50 లక్షల మేర మోసం చేసి జైల్లో ఊచలు లెక్కిస్తున్న ఈమెపై కేవలం ఒక్క పోలీస్ స్టేషన్ లోనే కాదు.. పంజాగుట్ట, నాంపల్లి, సీసీఎస్ ఠాణాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈమె ఆభరణాల వ్యాపారినే కాదు.. మరెంతో మందిని మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు తెలుస్తోంది.

ఇంతేకాదు.. తాజాగా మరో షాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. నందిని కొందరు మహిళలకు యువకులను సరఫరా చేసేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. హైఫై మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారికి నచ్చినట్లుగా కొందరు యువకులను సెలక్ట్ చేసి, మేల్ ఎస్కార్ట్స్‌గా పంపిస్తున్నట్లుగా దర్యాప్తులో భాగంగా బయటపడింది. సుమారు పాతిక మంది మహిళలకు మేల్ ఎస్కార్ట్స్‌ను సరఫరా చేసి భారీగా డబ్బు వసూలు చేసినట్లు కూడా తెలుస్తోంది. మరోసారి ఆమెను కస్టడీకి తీసుకుంటే చాలా విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మేల్ ఎస్కార్ట్స్ తోపాటు మహిళల్ని కూడా సరఫరా చేసి వుండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అందుకే.. నందిని చౌదరిని మరోమారు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలని ఓ వైపు నాంపల్లి పోలీసులు, మరో వైపు సీసీఎస్ పోలీసులు అనుకుంటున్నారు.

ఇదిలావుండగా.. తన స్పా అండ్ సెలూన్‌కు వచ్చే కస్టమర్లను నందిని మభ్యపెట్టి వారి నుంచి లక్షలాది రూపాయల విలువ చేసే ఆభరణాలతోపాటు అప్పు పేరుతో డబ్బు తీసుకొని ఎగ్గొట్టినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, సీసీఎస్ ఠాణాలో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. నందిని చౌదరి తమను రూ.20 లక్షలకు మోసం చేసిందని నాలుగు రోజుల క్రితం చందనా బ్రదర్స్ నిర్వాహకులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జూబ్లీహిల్స్ స్టేషన్‌లో తాజాగా మరోకేసు నమోదైంది. రూ. 20 లక్షల మేర తమను మోసం చేసిందంటూ ఇద్దరు వ్యాపారులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nandini chowdary news  beautician cheating case  male escorts  

Other Articles