If harish rao country bird then KTR

If harish rao country bird then ktr

Harish Rao, KTR, Telangana, TRS, KCR, Harish Vs KTR, KTR on Harish, harish on KTR, Harish Rao contraversial statements, KTR comments

In TRS party Harish rao and KTR fighting for the power. harish rao had strong base in the party. When telangana struggle going on, Harish Rao done key role in that.

హరీష్ నాటుకోడి ఐతే కేటీఆర్ ఏంటి...?

Posted: 11/17/2015 10:09 AM IST
If harish rao country bird then ktr

టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు, కేటీఆర్ ల మధ్య ఆదిపత్యపోరు నడుస్తోందని చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే దీనిని ఖండిస్తూ హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. తనకు సిఎం కావాలనే లేదని.. అలాంటి ఆలోచన తనకు లేదని అన్నారు. అయితే తాను, కేటీఆర్ పార్టీలో కలిసి తిరుగుతుంటే తట్టుకోలేని కొంత మంది కావాలనే ఇలాంటి పుకార్లను పుట్టిస్తున్నారని హరీష్ రావు వెల్లడించారు. అయితే మీడియాలో కూడా వస్తున్న వార్తలను హరీష్ ఖండించారు. కేటీఆర్, హరీష్ రావులు ఎప్పటికీ కలిసే ఉంటారని.. ఒకవేళ తనను పార్టీకి దూరం చెయ్యడం అంటే ప్రాణం తియ్యడమే అని స్పష్టం చేశారు హరీష్. హరీష్ రావుకు, కేటీఆర్ కు మధ్య ఎలాంటి తగాదాలు లేకపోతే.. వారిద్దరి మధ్యన ఎలాంటి ఆదిపత్యపొరు నడవకపోతే ఎందుకు అలాంటి వార్తలు వస్తాయి అన్నది కూడా విశ్లేషకుల ప్రశ్న.

Also Read: హరీష్ కు నాకు మధ్యన పోటీ వుంది...స్పష్టం చేసిన కేటీఆర్

హరీష్, కేటీఆర్, కవిత ఒక్కటేనా...?
హరీష్ రావు మొత్తం వ్యవహారం మీద మాట్లాడుతూ.. తాను, కేటీఆర్, కవిత ఒక్కటేనని.. దొడ్డిదారిన ఎన్నికల్లో, పార్టీలోకి రాలేదని అన్నారు. ఉద్యమంలో తాము పాలుపంచుకున్నామని.. తర్వాత ఎన్నికల్లో గెలిపిన తర్వాత ప్ర.జాప్రతినిధులుగా పూర్తిస్థాయిలో మారినట్లు వెల్లడించారు. అయితే ఇక్కడే ఓ లాజిక్ ఉంది. కేసీఆర్, హరీష్ రావు గురించి అందరికి తెలుసు. ఉద్యమం సమయంలో చాలా సార్లు హరీష్ రావు అరెస్టు కావడం.. తర్వాత విడుదల కావడం జరిగింది. కానీ ఉద్యమంలో పెద్దగా వినిపించని కేటీఆర్ పేరు ఇప్పుడే ఎందుకు వినిపిస్తోంది..? అన్నది ప్రశ్న.

హరీష్ రావు పార్టీలో కీలకంగా మారి.. ఉద్యమంలో ప్రధాన భూమిక వహిస్తున్న టైంలో కేసీఆర్ కేటీఆర్ ను ఎందుకు రంగంలోకి దించారు..? ఉద్యమం ఉదృతంగా లేనిసమయంలో కేటీఆర్ ఎందుకు రాలేదు..? అన్న దానికి కేసీఆరే సమాధానం చెప్పాలి. ఇక హరీష్ రావు గురించి.. ఆయన మాట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హరీష్ ఏ విషయం మీదైనా చాలా స్పష్టంగా మాట్లాడతారు.. ఎలాంటి విమర్శలకు తావులేకుండా వివరణ ఇవ్వగలరు. హరీష్ రావు ఉద్యమ సమయంలో ఎంతో మందిని ముందుండి నడిపించారు.. మరి కేటీఆర్ మాత్రం అలా ఎందుకు నడిపించలేకొపోయారు.

Also Read: రాజీనామాకు సిద్దమా..? హరీష్ రావ్ సవాల్

ఎంతైనా కేసీఆర్ కొడుకు కదా..?
హరీష్ రావు వరుసకి మేనల్లుడు, కానీ కేటీఆర్ స్వంత కొడుకు భవిష్యత్ రాజకీయాలకు వారసుడు కాబట్టే కేసీఆర్ కూడా ఎక్కడో కాస్త వివక్ష చూపుతున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత హరీష్ రావుకు కీలకమైన సాగునీటి పారుదల శాఖ ఇచ్చారు కేసీఆర్. తన కొడుకుకు ఐటి, పంచాయితీరాజ్ శాఖ కేటాయించారు. కానీ వార్తల్లో మాత్రం కేటీఆర్ వచ్చినంతగా హరీష్ రావు రావడం లేదు. ప్రభుత్వం చేపడుతున్న చాలా కార్యక్రమాల్లో కేటీఆర్ కీలకంగా మారారు. దీనికి కేసీఆర్ తన కొడుకు మీదున్న ప్రేమతోనే హరీష్ ను పక్కన పెడుతున్నారని చాలా మంది బావిస్తున్నారు.

Also Read: కేసీఆర్ బట్టలూడదీసే పాట.. వింటే షాక్

కాగా పార్టీలో మాత్రం హరీష్ రావు, కేటీఆర్ లలో ఎవరికి పగ్గాలు అందుకనే అర్హత ఉంది అంటే మాత్రం చాలా మంది హరీష్ రావు పేరే చెబుతారు. ఎందుకంటే హరీష్ రావు ముందు నుండి పార్టీలో ఉన్నారు. కింద స్థాయి క్యేడర్ వరకు అందరితో మంచి సంబందాలను కలిగి  ఉన్నారు. ఉద్యమ సమయంలో ఎన్నో సార్లు జైలుకు వెళ్లి వచ్చారు. అన్ని పరిస్థితులను తట్టుకొని నిలిచే నాయకుడిగా హరీష్ కు చాలా మంది ఓటు వేస్తారు. అందుకే హరీష్ రావును నాటుకోడితో పోలిస్తే..  కేటీఆర్ ను మాత్రం బాయిలర్ కోడితో పోలుస్తారు. అంటే కేటీఆర్ తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీని సంపాదించినా కానీ హరీష్ తో సమానంగా ఎన్నటికీ కాలేరు అన్నది అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles