Major twist in chittoor Mayor murder case

Major twist in chittoor mayor murder case

చిత్తూరు, చిత్తూరు మేయర్, మేయర్ అనురాధ, మేయర్ అనురాధ హత్య, చింటు, అనురాధ హత్య కేసు, mayor Anuradha, mayour, Chittoor, Chittoor mayor Murder, Murder case

చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో నిదితుడిగా భావిస్తున్న చింటు తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేశారు. చింటు తండ్రి మరణించగా.. తల్లి పరిస్థితి విషయంగా ఉంది.

చిత్తూరు మేయర్ హత్యకేసులో మరో మలుపు

Posted: 11/19/2015 03:12 PM IST
Major twist in chittoor mayor murder case

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారి తీసిన చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో మరో కీలక మలుపుచోటుచేసుకుంది. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు మేయర్ మృతి మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేవించారు. కాగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ తల్లిదండ్రులు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చింటూ తండ్రి మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాంతో కేసు మరో కీలక మలుపు తిరిగింది. కాగా హతంకులు హత్య తర్వాత ఓ వ్యక్తికి ధ్యాంక్స్ చెప్పినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.



Also Read: ధ్యాంక్స్ చెప్పిన మేయర్ హంతకులు 
 
రెండు రోజుల క్రితం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కటారి అనురాధను ఐదుగురు దుండగులు బురఖాలో వచ్చి పాయింట్ బ్లాక్‌లో కాల్పులు జరిపారు. ఆ వెంటనే ఆమె భర్త మోహన్‌పై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో అనురాధ అక్కడికక్కడే మృతి చెందగా మోహన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా కీలక నిందితుడిగా భావిస్తున్న చింటు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇప్పటి వరకు చింటు ఆచూకీ లభించలేదని పోలీసులు వెల్లడించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles