చెన్నైలో పరిస్థితి దారుణంగా మారింది. అక్కడి ప్రజలు తాగు నీటికి, తిండిలేక ఇబ్బంది పడుతున్నారు. అక్కడ సహాయక చర్యలకు సైన్యం రంగంలోకి దిగినా కానీ పరిస్థితి ఏ మాత్రం మారలేదు. చెన్నై మహా నగరానికి అండగా ఇప్పటికే చాలా మంది తెలుగు, తమిళ సినీ స్టార్స్ ఆర్థిక సహాయాన్ని అందించారు. అయితే తాజాగా పార్లమెంట్ సభ్యలు కూడా చెన్నైకి బాసటగా నిలుస్తున్నారు. తమిళనాడులో సహాయ, పునరావాస కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ ఎంపీల్యాడ్స్ నిధులను అందించేందుకు రాజ్యసభ ఎంపీలు ముందుకు వచ్చారు. పలువురు ఎంపీలు స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకున్న తమిళనాడు ప్రజలకు తమ ఎంపీల్యాడ్స్ నిధులను అందించాలన్న సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి రాజ్యసభలో చేసిన ప్రతిపాదనను ఇతర సభ్యులు స్వాగతించారు. వరద బాధితుల కోసం తన ఎంపీ ల్యాడ్స్ నిధి నుంచి రూ. 50 లక్షలను బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్, ఎంపీల్యాడ్ నిధిలో కొంతభాగంతో పాటు ఒక నెల వేతనాన్ని ఆర్ పీఐ సభ్యుడు రామ్ దాస్ అథవాలే విరాళంగా ప్రకటించారు.
Also Read: చెన్నైకి అండగా తెలుగు సినిమా స్టార్స్
తమిళనాడు, ముఖ్యంగా చెన్నై దాని చుట్టుపక్కల జిల్లాలు, ఆంధ్రప్రదేశ్-లోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగింది. బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. సంబంధిత ఆర్థిక సాయాన్ని తక్షణమే అందించాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు, వరదల పరిస్థితిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జరిపిన సమీక్షా సమావేశంలో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, తాను పాల్గొన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు రాజ్యసభకు తెలిపారు.
Also Read: మొదటిసారి ది హిందు పత్రిక ఆగిపోయింది.. ఎందుకంటే
Also Read: చెన్నైలో ధియేటర్లు, షాపింగ్ మాల్సే దిక్కు
భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను రాజ్యసభలో ప్రస్తావిస్తూ వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై ఫొటోలను తన కూతురు, మనవరాలు పంపించారని, బాధితులను కాపాడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. తమిళనాడుకు తక్షణ సాయంగా రూ. 933 కోట్లను కేంద్రం అందించిందన్నారు. సైన్యాన్ని, నౌకాదళాన్ని, ఎన్.డీ.ఆర్.ఎఫ్ ను రంగంలోకి దింపామన్నారు. మొత్తం వరద నష్టం రూ. 8,481 కోట్లుగా రాష్ట్రం అంచనా వేస్తే కేంద్రం కేవలం రూ. 830 కోట్లే ఇచ్చిందని కనిమొళి (డీఎంకే)అన్నారు. తమిళనాడు వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని పలువురు డిమాండ్ చేశారు. చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో వరద సహాయ చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులను ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు. అక్కడి వరద పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, సహాయ పునరావాస చర్యలను యద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more