Cambodian doctor sentenced to 25 years for infecting 200 patients with HIV

Cambodian doctor sentenced to 25 years for infecting 200 patients with hiv

doctor, AIDS, Combodia, Court, Yem Chroeum, Doctor Yem Chroeum, AIDS in Combodia

An unlicensed Cambodian doctor was sentenced to 25 years in prison today after he was found guilty of infecting more than 200 people with HIV, including some who later died. The case has shone a spotlight on the chronically underfunded healthcare system in the impoverished nation where many have to rely on self-taught or unlicensed medics to receive treatment.

ఆ వైద్యుడి వల్ల 200 మందికి ఎయిడ్స్

Posted: 12/03/2015 05:00 PM IST
Cambodian doctor sentenced to 25 years for infecting 200 patients with hiv

ప్రాణాలను కాపాడే వైద్యుడిని మనం సాక్షాత్తు దేవుడిగా భావిస్తాం. ఐతే, ఈ మధ్య కాలంలో దొంగ వైద్యులు పుట్టుకొస్తూ, ప్రాణాలను హరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా జరుగుతున్నాయి. కాంబోడియాలో యెమ్ చరిన్ అనే వ్యక్తి ఎటువంటి డిగ్రీలు లేకపోయినా వైద్యుడి అవతారం ఎత్తాడు. బట్టామాబాంగ్ ప్రావిన్స్ లో రోఖా అనే గ్రామీణ తెగకు వచ్చీ రాని వైద్యం చేస్తూ  రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఐతే, ఒకరికి ఉపయోగించిన నీడిల్ నే మరొకరికి వాడుతూ వైద్యం చేశాడు. ఈ క్రమంలో 200 మందికి పైగా ఎయిడ్స్ సోకింది. వీరిలో ఇప్పటికే పది మందికి పైగా మరణించారు. ఎయిడ్స్ సోకిన వారంతా 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసువారే. ఈ తప్పిదానికి పాల్పడినందుకు యెమ్ చరిన్ పై కాంబోడియా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా అతడికి 25 ఏళ్ల కారాగార శిక్షనను విధించింది.  

Also Read: ఇంజెక్షన్ పట్టు.. హెచ్ఐవీకి చెక్ పెట్టు! 

వచ్చీరాని వైద్యంతో తన దగ్గరికి వచ్చిన రోగులను పరిశీలించి.. ఏదో వైద్యం చేసేస్తుంటాడు అయితే అలా వచ్చీ రాని వైద్యంతో ఎలాగోలా కాలం నెట్టుకువస్తున్న తన దగ్గరికి వచ్చిన రోగులకు మాత్రం తెలియకుండానే ఎయిడ్ప్ వ్యాధిని అంటగట్టాడు. 106 గ్రామాల్లో 800 మందికి పైగా వైద్ పరీక్షలు చెయ్యగా అందులో అతడి వద్ద వైద్యం చేయించుకున్న 200 మందికి ఎయిడ్స్ వ్యాధి సోకినట్లు తేలింది. ఇప్పటికే ఓ గ్రామంలో పది మంది ఇప్పటికే మరణించారు. వైద్యం చేయించుకుందామని వస్తే ఇలా మాయరోగం అంటగడతాడని పాపం వాళ్లకు మాత్రం ఏ తెలుసు..? ఆ వైద్యుడికి తాజాగా 25 ఏళ్ల జైలు శిక్షను విధించింది కోర్టు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : doctor  AIDS  Combodia  Court  Yem Chroeum  Doctor Yem Chroeum  AIDS in Combodia  

Other Articles