A Wedding in the Chennai Floods

A wedding in the chennai floods

Chennai, Chennai rains, Chennai floods, chennai wedding, Chennai wedding in floods

It was a monsoon wedding everyone involved would remember. Hours before the wedding, the groom and his entire family had to be rescued by hired boats -- the Velachery area of Chennai, where their home is located, was flooded. It was a particularly tense period for bride-to-be Purnima and her parents. The wedding was on Sunday, but the groom, Rajagopal, could not be contacted for four days before that. Till phone connectivity lasted, the groom's family had assured come what may, they would be on time. "After the first day, we began to panic," said Purnima.

ITEMVIDEOS: వరదలోనే చేసుకున్నాడు పెళ్లి

Posted: 12/07/2015 08:57 AM IST
A wedding in the chennai floods

చెన్నైలో భయంకరమైన వరద వచ్చింది. గత కొంత కాలంగా కురిసిన వానలు అక్కడి పరిస్థితిని మార్చేశాయి. అన్ని చోట్లా నీళ్లు చేరి.. చెన్నై చెరువైంది. చెన్నై పక్కన ఓ సముద్రం ఉంటే.. చెన్నైలో ఓ సముద్రం ఉందా అనిపించింది. అయితే ఈ వరదకు ఓ పెళ్ళికి లింక్ ఉంది. ఇంత వరదలో కూడా ఓ జంట ఏకమయ్యారు. నిజానికి పెళ్లి ఆగిపోతుందేమో అనుకున్నా.. చివరి క్షణం వరకు ఉత్కంఠతతో శుభం కార్డు పడింది. ముచ్చటగా మూడు ముళ్లు వేసిన పెళ్లి కొడుకు.. ఏడడుగులు నడిచి అగ్ని సాక్షిగా, వరద సాక్షిగా ఏకమయ్యాడు. అసలే వరద అందులోనూ పెళ్లి ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారా..? అచ్చం సినిమా స్టోరీని తలపించే ఈ పెళ్లి కథ ఏంటో మీరే తెలుసుకోండి.

చెన్నైలోని వెలాచెరీ ప్రాంతానికి చెందిన రాజగోపాల్ కు, పూర్ణిమకు పెళ్లి కుదిరింది. వీళ్లిద్దరూ కూడా యుఎస్ లో జాబ్ చేస్తుంటారు. వీళ్ల పెళ్లికి సంవత్సరం ముందు నుండే ఏర్పాట్లు చేస్తున్నారు. అందరికి కార్డులు ఇవ్వడం, హాల్ కు అడ్వాన్స్ ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి. అయితే చెన్నై నగరాన్ని ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో సరిస్థితి తారుమారైంది. అక్కడకి వచ్చిన బంధువులు, మిత్రులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అయితే పరిస్థితిని వివరిద్దామని పెళ్లి కొడుకు తరఫు వాళ్లు ఎంత ట్రై చేసినా ఫోన్ కాంటాక్ట్ దొరకలేదు. అసలు సిగ్నల్స్ ఉంటే కదా. దాంతో ఏమి చెయ్యాలో అర్థంకాని పెళ్లికొడుకు తరఫు వాళ్లు ఎలాగైనా పెళ్లికి సిద్దమయ్యారు. రెస్కూ బోట్ల ద్వారా ఫంక్షన్ హాల్ కు చేరుకున్న పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. ఫంక్షన్ హాల్ కు రావడానికి ఇబ్బంది పడ్డా కానీ జీవితాంతం గుర్తుండుపోయే క్షణాలను చెన్నై వదర మరింత గుర్తుంచుకునేలా చేసిందని రాజగోపాల్, పూర్ణిమ దంపతులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai  Chennai rains  Chennai floods  chennai wedding  Chennai wedding in floods  

Other Articles