రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి.. చేసేది మరోకటనే నానుడి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ కు సరిగ్గా సరిపోలుతుంది. ఇన్నాళ్లు తాను కాంగ్రెస్ పార్టీలోనే వుంటానని భీష్మించిన నేత.. గుట్టు చప్పుడు కాకుండా.. పార్టీ నుంచి పలాయనం చిత్తగిద్దామనుకున్నారు. అందుకనే బయట మీడియాకు మాత్రం తాను పార్టీ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పిన దానం.. అదే సమయంలో తన అనుచరగణానికి మాత్రమే తాను పార్టీ మారుతున్న విషయాన్ని చెప్పి.. కటౌట్లు సిద్దం చేయించుకున్నారు.
ఇక అంతా రెడ్డీ అనుకున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దానం నాగేందర్ కు ఝలక్ ఇచ్చారు. రెండు రోజుల వరకు కరువు ప్రభావిత ప్రాంతాలలో తిరిగి ప్రజల కష్టనష్టాలను తెలుసుకోనున్న ముఖ్యమంత్రి.. పార్టీలోకి చేరుందుకు సమయం కేటాయించాలని దానం అడగగానే.. తెలంగాణ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు సమక్షంలో పార్టీలో చేరమని ఝలక్ ఇచ్చారు. దీంతో పార్టీలోకి చేరేందుకు కటౌట్లు ఏర్పాట్లు చేసుకున్న దానం నాగేందర్ వాటిని హడావిడిగా వెనక్కు తీసివేయించారు.
ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో తానంటే పడని వాళ్లు పొమ్మనలేక పోగబెడుతున్నారని ఆరోపించిన దానం.. అక్కడితో ఆగకుండా.. పార్టీ నడపడం చేతకాని వాళ్లే కొందరు తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో అటు కాంగ్రెస్ వారికి దానం ఇక తమ పార్టీలో వుండడు అనడానికి సాక్ష్యం లభించగా, దానం నాగేందర్ పరిస్థితే రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. అటు కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాధించలేక ఇటు టీఆర్ఎస్ పార్టీలోనూ చేరికపై సందిగ్ధత ఏర్పడటంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో వున్నారు దానం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more