సతిపై కొండంత నమ్మకం పెట్టుకున్న ఆ పతి గుండె పగిలింది. తనకు అండగా నిలచి, వేడినీళ్లకు చన్నీళ్లు అన్న మాదిరిగా ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తూ తనకు అండగా నిలుస్తుందని అనుకున్న ఆయన నమ్మకాలు కాలిబూడిదయ్యాయి. తన నమ్మకాలను పటాపంచలు చేస్తూ తన భార్య చేయకూడని పనులు చేస్తుందని తెలుసుకున్న భర్త.. అమె ఆ వ్యాపారం గురించి నేరుగా పోలీసులకు చెప్పడమే కాకుండా దగ్గరుండీ మరీ అమెను పట్టించి తన నిజాయితీని నిలబెట్టుకున్నాడు.
అన్ లైన్ కేంద్రంగా చేసుకుని సైబర్ సెక్స్ కు పాల్పడుతూ.. గుట్టుచప్పుడు కాకుండా తన భార్య సాగిస్తున్న వ్యభిచార వ్యాపారానికి సైబర్ క్రైం పోలీసుల సహాయంతో చెక్ పెట్టాడు. దేశరాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. భార్య స్నేహితురాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెపై నిఘా పెట్టాడు. పనిమనిషి ముసుగులో భార్య సాగిస్తున్న వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ లో సాగిస్తున్న కార్యకలాపాల గుట్టు రట్టయింది. దీనికి సంబంధించిన రెండు వీడియోలలో తన భార్య కూడా దర్శనమివ్వడంతో విస్తుపోయాడు. ఆనక పోలీసులకు సమాచారం అందించాడు.
ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తున్నానని సదరు భార్య మొదట బుకాయించింది.. తనపై సైబర్ సెక్స్ అరోపణలన్నీ అబద్ధమంటూ నటించింది. తాను ఎలాంటి అక్రమ కార్యకలాపాలు సాగించడంలేదని వాదించింది. అయితే ఆమె పనిచేస్తున్న ప్రదేశానికి వెళ్లి ఆరా తీసిన పోలీసులకు మరికొన్ని వాస్తవాలు తెలిసాయి. ఇళ్లలో పనిచేయడంతో పాటు వ్యభిచార కూడా చేస్తుందని తెలుసుకన్న పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు. అమెను విచారిస్తే మరికొన్ని వాస్తవాలు బయటకు వస్తాయని.. ఈ నేపథ్యంలో తెరవెనుక హస్తాలపై ఆరా తీస్తున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more