pakistan sets 84 runs target to india in asia cup

India needs 84 runs to win against pakistan

Asia Cup 2016, Cricket, Dhaka, India, Live Scores, Live Updates, MS Dhoni, Pakistan, Rohit Sharma, Shahid Afridi, Sports, Umar Akmal, Virat Kohli, ICC World Twenty20, Pakistan, India, pakistan cricket board, bcci, india vs pakistan, ind vs pak icc t20, 2016 t20 world cup, t20 world cup 2016, world t20, cricket, cricket news

Pakistan's 83 is the third lowest total by any side against India- also their third lowest in all T20Is.

పేకమేడలా కూలిన పాకిస్థాన్.. అదరగొట్టిన టీమిండియా

Posted: 02/27/2016 08:15 PM IST
India needs 84 runs to win against pakistan

ఎంతో కాలంగా దాయాది దేశాల క్రికెట్ పోరు కోసం ఎదురుచూస్తున్న ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఇవాళ ఆ నయనానందం, సంతోషం లేకుండా పోయాయి. భారత్, పాక్ ఇరు దేశాల మధ్య చానాళ్లకు జరుగుతున్న ట్వంటీ 20 పోరులో హోరాహోరా పోరుకు తెరలేస్తుందనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ పేకమేడలా కూలింది. నిర్ణీత 20 ఓవర్లను కూడా ఆగకుండానే 17.4 ఓవర్లకే చాపచుట్టేసింది.

ఆసియాకప్లో భాగంగా జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ రెండెకెల స్కోరును సాధించడానికే నానా తంటాలు పడింది. భారత్ పదునైన బౌలింగ్కు కట్టుదిట్టమైన ఫీల్డింగ్ తోడవడంతో పాక్ ఇంకా 15 బంతులుండగానే మూటగట్టేసింది. టాస్ గెలిచిన భారత్ తొలుత పాకిస్తాన్ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ముందు పాకిస్తాన్ బ్యాటింగ్లో కట్టడి చేయాలని భావించిన ధోని అండ్ గ్యాంగ్ అందుకు తగ్గట్టునే రాణించింది. కేవలం 17.3 ఓవర్లలో 83 పరుగులకే పాక్ ను కూల్చేసింది.

పాకిస్తాన్ ఆటగాళ్లలో మహ్మద్ హఫీజ్(4), షలీల్ ఖాన్(7), ఖుర్రామ్ మంజూర్(10),షోయబ్ మాలిక్(4), ఉమర్ అక్మల్(3), ఆఫ్రిది(2), రియాజ్(4)లు తీవ్రంగా నిరాశపరిచారు. సర్ఫరాజ్ అహ్మద్(25) చేసిన పరుగులే పాక్ జట్టులో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించగా, రవీంద్ర జడేజాకు రెండు, నెహ్రా, బూమ్రా, యువరాజ్ సింగ్లకు తలో వికెట్ లభించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asia cup Twenty20  Pakistan  India  pakistan cricket board  bcci  

Other Articles