Darul Uloom Deoband issues fatwa against chanting of 'Bharat Mata ki jai'

Darul uloom issues fatwa against chanting bharat mata ki jai

bharat mata ki jai, fatwa, islamic seminary, darul uloom deoband, islamic seminary darul uloom, deoband, islam, Sadhvi Niranjan Jyoti,Fatwa Against Bharat Mata ki Jai, Bharat Mata Controversy

The fatwa states that only a human can give birth to a human, so how can the country be called 'mother'.

‘భారత్ మాతాకీ జై’ అనాల్సిన అవసరం లేదంటూ ఫత్వా..

Posted: 04/01/2016 07:16 PM IST
Darul uloom issues fatwa against chanting bharat mata ki jai

దేశం మనది, తేజం మనదే ఎగురుతున్నజెండా మనదే, నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం వుంది ఈ నేలలో అత్మీయరాగం వుందని ఈ గాలిలో.. ఏ కులమైనా, ఊ మతమైనా భరతమాతకొకటేలేరా ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా వందేమాతరం అందామందరం వందేమాతరం.. అందామందరం అంటూ సాగే ఈ పాటకు అర్థం తెలుసా,,; తెలియదా అర్థం కాదు కానీ ఏకంగా కన్న తల్లి కన్న గోప్పదైన జన్మభూమిని స్మరించుకోవడం కులమతాలకు అతీతంగా సాగాల్సిన పక్రియ. నీది ఏ కులం, ఏ మతం అని ఎక్కడా అడగరు, కానీ ఎక్కడికి వెళ్లినా నీది ఏ దేశం అని తప్పక అడుగుతారు, నీ జాతీయతను చెప్పుకోనేందుకు భయమెందుకు, అలాగే.. జాతీని కన్న తల్లిని గౌరవించడానికి జంకు ఎందుకు.

ఇప్పుడివే ప్రశ్నలు తలెత్తతున్నాయి. ఒక్క బీజేపి పార్టీ, లేదో మరో పార్టీయో చెబితే భారత్ మాతాకీ జై అనాల్సిన అవసరం నిస్పందేహంగా ఎవరీకీ లేదు. మా తల్లిని స్మరించుకోవడానికి మీరు చెప్పాలా అని ఎదురు ప్రశ్నించాల్సిన తరుణంలో ఏకంగా అర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ భారత్ మాతాకీ జై అని ఎవరి చేత బలవంతంగా చెప్పించాల్సిన అవసరం లేదని చెప్పిన రెండు రోజుల్లోనే ఏకంగా ఓ ముస్లిం మత సంస్థ ఫత్వా జారీ కావడం కలకలం రేపుతోంది.

పుట్టేది భారత మాత ఒడిలో, పెరిగేది ఆమె దీవెనలతో, కాలగమనంలో మరణిస్తే అప్పుడు కూడా ఇక్కడి మట్టిలోనే కదా ఖననం చేసేది, అలాంటి అమ్మ పేరును స్మరించుకుంటూ జై అని చెప్పడానికి ఎందుకు భయమన్నది అర్థంకాని ప్రశ్న. ఎన్ని రోజులుంటాయో తెలియని రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నాయకులకు జై కోట్టడానికి లేని అభ్యంతరం జన్మభూమికి జై కోట్టడానికి ఏమిటీ..? ఇప్పుడిదే ప్రశ్న దేశంలోని అన్ని వర్గాలలో వ్యక్తమవుతోంది.

ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ ఇస్లామిక్ మత సంస్థ 'దారుల్ ఉలూమ్ దేవ్ బంద్' ఈ మేరకు ఓ ఫత్వా జారీ చేసింది. రెండు రోజులపాటు చర్చించిన ముస్లిం మత స్కాలర్లు నిర్ణయించిన మేరకు...తామంతా దేశాన్ని ప్రేమిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే దేశమే తమ దేవుడు కాదని వారు తెలిపారు. హిందూ మతానికి, ఇస్లాం మతానికి వ్యత్యాసం ఉందని వారు పేర్కొన్నారు. హిందూ మతం విగ్రహారాధన చేస్తే, ఇస్లాం విగ్రహారాధనకు వ్యతిరేకమని వారు చెప్పారు. భారత్ మాత అనే దేవతను హిందువుల్లో ఒక వర్గం పూజిస్తుందని స్కాలర్లు అభిప్రాయపడ్డారు. కానీ దైవం వేరు జన్మభూమి వేరు అని వారికి తెలియదా..? అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.

ఇస్లాం నియమాల ప్రకారం దేవుడు ఒక్కడేనని, మరో దేవుడిని పూజించకూడదని వారు తెలిపారు. కావున 'భారత్ మాతా కీ జై' నినాదం చేయాల్సిన అవసరం లేదని ఫత్వా జారీ చేశామని వారు చెప్పారు. దేశపౌరులకు రాజ్యాంగం మతస్వేచ్ఛను ఇచ్చిందని, భారత రాజ్యాంగానికి లోబడి తాము ఫత్వా జారీ చేశామని వారు తెలిపారు. ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ తమ భావజాలాన్ని చట్టానికి వ్యతిరేకంగా పౌరులమీద రుద్దడం సరికాదని ఇస్లామిక్ స్కాలర్లు స్పష్టం చేశారు. అయితే చదవుకున్న వాడు కీకరకాయ అన్నట్లు వుంది వీరి వాదన అంటూ వ్యతిరేకించే వారి సంఖ్య కూడా తక్కువేం లేదు. ఇన్నాళ్లు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వచ్చాయ్ అంటూ ప్రశ్నింస్తున్నారు. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు 'భారత్ మాతా కీ జై' అంటేనే భారతీయులంటూ చేస్తున్న ప్రచారంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bharat mata ki jai  fatwa  islamic seminary  darul uloom deoband  

Other Articles