పోగోట్టుకున్న చోటే వెతికితేనే పోగుట్టకున్నది దోరుకుతుంది అన్నది పాత నానుడి.. ఇలా ఆంధ్రప్రదేశ్ లో తన కాలు పోగొట్టుకుని, బతుకుదెరువును పోగోట్టుకుని పరాయి రాష్ట్రానికి వెళ్లి పోట్టకూటి కోసం యాచకవృత్తిని చేపట్టిన ఆ దురదృష్టవంతుడికి అక్కడ అదృష్ట లక్ష్మీ వరించింది. అనంతపురం జిల్లాకు చెందిన పొన్నయ్యది అలాంటి అదృష్టమే. బతకడం కోసం బెగ్గర్(యాచకుడి)గా మారిన అతనికి భారీ మొత్తం లాటరీలో బహుమతిగా దక్కింది. అది కూడా కేరళలో!
పొన్నయ్య ప్రస్తుత నివాసం కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని మార్తండం(కేరళ) బస్ స్టాండ్. ఒక కాలు లేని అతను బిచ్చమెత్తుకుని బతుకీడుస్తున్నాడు. కూడబెట్టిన సొమ్ములో కొంత అనంతపురంలో ఉంటోన్న భార్యకు పంపుతాడు. మిగిలిన దానితో లాటరీ టికెట్లు కొంటాడు. రెండు రోజుల కిందట పోలీసులు వచ్చి పొన్నయ్యను స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీసులతోపాటే వచ్చిన ఓ వ్యక్తి స్టేషన్ కు వెళ్లిన తర్వాత అసలు విషయం చెప్పాడు. 'పొన్నయ్య.. నీకు లాటరీలో రూ.65 లక్షల బహుమతి వచ్చింది' అని. ఆ వ్యక్తి.. పొన్నయ్యకు లాటరీ టికెట్ అమ్మినాయన!
కేరళలో ప్రభుత్వ అనుమతితో లాటరీలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సందర్భంలో పోలీసుల ప్రమేయం ఉంటుంది కాబట్టి బహుమతి వచ్చినవాళ్లను బురిడీ కొట్టించడం అంత తేలికకాదు. అమౌంట్ కాస్త ఎక్కువ కాబట్టి పొన్నయ్య వాళ్లింటికి కబురు పెట్టారు పోలీసులు. పొన్నయ్య వాళ్ల నాన్న, అన్నయ్యలు నిన్నే అనంతపురం నుంచి కేరళకు వెళ్లారు. పొన్నయ్య అంగీకారంతో సదరు డబ్బును వాళ్లకు ఇచ్చేశారు పోలీసలు. ఈ డబ్బులతో తన పిల్లల చదువులు, ఇల్లాలి కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తున్నాడు పొన్నయ్య.
మొదట్లో భవన నిర్మాణ కూలీ అయిన పొన్నయ్య పని ప్రదేశంలో కిందపడి కాలు పోగొట్టుకున్నాడు. అప్పట్నుంచి పనికి వెళ్లలేకి బిక్షగాడిగా మారి ఇంటిని నెట్టుకొస్తున్నాడు. ఏపీలో బతుకు మరీ భారంగా మారడంతో కేరళకు వలస వెళ్లి అక్కడా వృత్తిని కొనసాగించాడు. ఇంత డబ్బొచ్చింది కదా, ఇక హ్యాపీగా ఇంటికి వెళతాడేమో అనుకుంటే.. 'అలా కాదు, కేరళలోనే ఉండి అదే వృత్తిని కొనసాగిస్తా'అని చెబుతున్నాడు పొన్నయ్య!
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more